పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

|

May 19, 2024 | 2:19 PM

రాజస్తాన్ లో ప్రాణాపాయం అంచున కొట్టుమిట్టాడుతున్న ఓ 22 నెలల బాలుడిని కాపాడేందుకు సామాన్యులంతా చేయిచేయి కలిపారు. తోపుడు బండ్ల చిరు వ్యాపారులు మొదలు పోలీసుల దాకా అందరూ మానవత్వాన్ని చాటారు. ఆ చిన్నారిని బతికించేందుకు అవసరమైన జోల్ జెన్స్ మా అనే 17.5 కోట్ల రూపాయల ఖరీదైన విదేశీ ఇంజెక్షన్ ను తెప్పించేందుకు తమ వంతు సాయం చేశారు.

రాజస్తాన్ లో ప్రాణాపాయం అంచున కొట్టుమిట్టాడుతున్న ఓ 22 నెలల బాలుడిని కాపాడేందుకు సామాన్యులంతా చేయిచేయి కలిపారు. తోపుడు బండ్ల చిరు వ్యాపారులు మొదలు పోలీసుల దాకా అందరూ మానవత్వాన్ని చాటారు. ఆ చిన్నారిని బతికించేందుకు అవసరమైన జోల్ జెన్స్ మా అనే 17.5 కోట్ల రూపాయల ఖరీదైన విదేశీ ఇంజెక్షన్ ను తెప్పించేందుకు తమ వంతు సాయం చేశారు. కేవలం 2 నెలల వ్యవధిలో ఏకంగా 9 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. మానవ సంబంధాలు ఎంత గొప్పవో ఈ సంఘటన తెలియజేసింది.

రాజస్తాన్ పోలీసు శాఖలో ఎస్సైగా పనిచేస్తున్న నరేశ్ శర్మకు హృదయాంశ్ శర్మ అనే 22 నెలల బాలుడు ఉన్నాడు. అయితే ఆ బాలుడికి అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి రావడంతో కాళ్లు, చేతులు కదపలేకపోతున్నాడు. దీంతో రెండు నెలల కిందట నరేశ్ శర్మ దంపతులు తమ కుమారుడిని జైపూర్ లోని జేకే లోన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అతను జన్యు లోపంతో బాధపడుతున్నట్లు తేల్చారు. జన్యు లోపాన్ని సరిచేసే ఇంజెక్షన్ ను పుట్టిన రెండేళ్లలోగా ఇస్తే బాలుడు బతుకుతాడని లేకపోతే ప్రాణాపాయం తప్పదని పిడుగులాంటి వార్త చెప్పారు.

దీంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు తమ చిన్నారిని రక్షించేందుకు బంధువుల సూచనతో క్రౌడ్ ఫండింగ్ బాట పట్టారు. తమ బ్యాంకు ఖాతా వివరాలతో ఆన్ లైన్ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. తోచినంత సాయం చేయాలని రాజస్తాన్ సీఎం సహా రాజకీయ నాయకులు, పోలీసులు, సెలబ్రిటీలను అర్థించారు. దీనిపై స్పందించిన రాజస్తాన్ పోలీసు శాఖ మొత్తం డిపార్ట్ మెంట్ లోని ఉద్యోగుల ఒక రోజు వేతనమైన 5 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. అలాగే సోనూ సూద్, క్రికెటర్ దీపక్ చాహర్ వంటి సెలబ్రిటీలతోపాటు ఎందరో సామాన్యులు తమకు తోచిన మొత్తాన్ని అందించారు. దీంతో రెండు నెలల వ్యవధిలో 9 కోట్ల రూపాయలు సమకూరాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.