తిరుమల కొండపై కాళ్లకు కవర్లెందుకు కట్టుకుంటున్నారు
ఏప్రిల్ మొదటివారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రతరం చేశాడు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలు నిప్పుల కుంపటిలా మారాయి. చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తిరుమలకొండపైన భానుడు భగభగమంటున్నాడు. వేసవి సెలవులకు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వీరిలో కాలినడకన వెళ్లే భక్తులు కూడా ఉంటారు.
ఏప్రిల్ మొదటివారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రతరం చేశాడు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలు నిప్పుల కుంపటిలా మారాయి. చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తిరుమలకొండపైన భానుడు భగభగమంటున్నాడు. వేసవి సెలవులకు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వీరిలో కాలినడకన వెళ్లే భక్తులు కూడా ఉంటారు. రోజు రోజకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కాలిబాటలు, మాడవీధులు కాలుతున్న పెనంలా మారుతున్నాయి. మాఢవీధుల్లో ఎండతీవ్రతకు భక్తులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడక మార్గంలో, మాడ వీధుల్లో కాళ్లకు గోనెసంచులు కట్టుకొని భక్తులు స్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఎండ తీవ్రతనుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భానుడి ప్రతాపం నుంచి అవి రక్షణ కల్పించలేకపోతున్నాయి. మాఢవీధుల్లో, భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్‌లు వేస్తున్నారు.. వాటర్ ట్యాంకర్లతో మాడవీధులను తడుపుతున్నా.. పెనంమీద వేసిన నీరులా ఆవిరైపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ranbir Kapoor: ఒక్క సినిమాలో నటిస్తే రూ. 225 కోట్లా ??
Allu Arjun: రికార్డుల రారాజు.. హీరోల్లో నెం1 ఈ పుష్ప రాజు..