AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: రికార్డుల రారాజు.. హీరోల్లో నెం1 ఈ పుష్ప రాజు..

Allu Arjun: రికార్డుల రారాజు.. హీరోల్లో నెం1 ఈ పుష్ప రాజు..

Phani CH
|

Updated on: Apr 09, 2024 | 11:08 AM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. హీరోగానే కాకుండా బన్నీ స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్, డాన్స్‏కు యూత్‏లో ఫుల్ క్రేజ్ ఉంది. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ అతి తక్కువ సమయంలోనే తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. హీరోగానే కాకుండా బన్నీ స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్, డాన్స్‏కు యూత్‏లో ఫుల్ క్రేజ్ ఉంది. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ అతి తక్కువ సమయంలోనే తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ రోజు అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఖాతాలో రికార్డులు కూడా మరో సారి తెరపైకి వస్తున్నాయి. బన్నీని ట్రెండ్ అయ్యేలా హీరోల్లో నెం1 హీరో అనే ట్యాగ్ వచ్చేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న జన్మించారు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా.. గీతా ఆర్ట్స్ అధినేత.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత సినిమాతోపాటు.. కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు బన్నీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ కాంబోలో వచ్చిన డాడీ మూవీలో టీనేజ్ కుర్రాడిగా నటించారు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న బన్నీ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Family Star: కావాలనే నా సినిమాను.. నెగెటివ్ చేస్తున్నారు..

Pushpa 2: యేయ్‌ !! వీడియో చూస్తే ఎవ్వరికైన పూనకాలు… రావాలా…