Ayodhya: బ్రహ్మచారి భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం.! నిర్మాణం జరిగేవరకూ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ.

| Edited By: TV9 Telugu

Dec 28, 2023 | 5:44 PM

అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. బైతూల్​కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్​ భోజ్​పలి బాబా అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు.

అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. బైతూల్​కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్​ భోజ్​పలి బాబా అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకు వివాహం చేసుకోనని 1992 డిసెంబర్​ 6న శపథం చేసి, అలా ఒంటరిగానే ఉండిపోయారు. చివరికి బాబాగా మారిపోయారు. ఇప్పుడు అతన్ని భోజ్ పలి బాబాగా వ్యవహరిస్తుంటారు. తాజాగా రామాలయ నిర్మాణం పూర్తి చేసుకొని.. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో రవీంద్ర గుప్తాకు అయోధ్య ట్రస్టు నుంచి ఆహ్వానం అందింది. విశ్వహిందూ పరిషత్ లో సభ్యుడిగా ఉన్న రవీంద్ర.. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు తాను పెళ్లి చేసుకోనన్న మాట మీదనే నిలిచారు. తాజాగా అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా తాను వివాహం చేసుకోనని, తన జీవితాన్ని శ్రీరామునికే అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ తరహా భక్తుల్ని గుర్తించి మరీ.. అయోధ్య ట్రస్టు రామాలయ ప్రారంభానికి ఆహ్వానాల్ని పంపుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 26, 2023 06:30 PM