Devil dog: కుక్క దెయ్యంగా మారితే ఏం చేస్తుందో తెలుసా.. వీడియో చూస్తే షాకవుతారు..!
శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే మనుషులు అంత చురుకుగా ఉంటారు. అందుకే కొందరు రకరకాల కసరత్తులు, యోగా, వ్యాయామం లాంటివి చేస్తుంటారు. ఇప్పడు జంతువులు కూడా ఈ లిస్ట్‌లోకి చేరిపోయాయి.
శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే మనుషులు అంత చురుకుగా ఉంటారు. అందుకే కొందరు రకరకాల కసరత్తులు, యోగా, వ్యాయామం లాంటివి చేస్తుంటారు. ఇప్పడు జంతువులు కూడా ఈ లిస్ట్‌లోకి చేరిపోయాయి. అవికూడా మనుషుల్లాగే రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అలాంటిదే. ఈ వీడియో ఓ కుక్కకు సంబంధించినది. ఈ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది.సాధారణంగా మనుషులు తలను కొంతవరకు వెనక్కి, పక్కకి తిప్పుతారు.. కొన్ని జంతువులు కూడా అలా కొంతవరకు తిప్పగలవు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న కుక్క మాత్రం తన తలను ఏకంగా 180 డిగ్రీలు వెనక్కి తిప్పింది. ముందువైపు ఉండాల్సిన తలను ఏకబిగిన వెనక్కి తిప్పి పెట్టింది. దాంతో దాని నాలుగు కాళ్లు ముందరివైపు, తల, వెన్ను భాగం వెనుకవైపు కనిపిస్తున్నాయి. చూడటానికి చాలా విచిత్రంగా, భయంకరంగా అనిపిస్తోంది. అది చూసి..ఇది నిజంగా నిజమేనా? ఇంత ఫ్లెక్సిబులిటీనా..అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మరికొందరు భయపడిపోతున్నారు. అమ్మోఇది దెయ్యం కుక్క కాబోలు..దీనికి భూత వైద్యుడు అవసరం అని కామెంట్స్ పెడుతున్నారు. సడెన్‌గా చూసి జడుసుకున్నామంటూ ఇంకొందరు తమ అనుభవాన్ని కామెంట్‌గా పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షిస్తూ.. వేలల్లో లైక్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??

