Nita Ambani: నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? అంబానీ పెళ్ళిలో హైలెట్..

Nita Ambani: నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? అంబానీ పెళ్ళిలో హైలెట్..

Anil kumar poka

|

Updated on: Jul 16, 2024 | 5:27 PM

ప్రపంచస్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ల వివాహం అత్యంత ఆడంబరంగా జరిగింది. దీనికిముందు కుటుంబంతో కలిసి పెళ్లి వేదిక వద్దకు వస్తున్నప్పుడు ముకేశ్ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) చేతిలో కనిపించిన సంప్రదాయ చిహ్నం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది రామన్‌ దివో. దానిపై గణేశుడి ప్రతిమ దర్శనమిచ్చింది. గుజరాతీ పెళ్లిళ్లలో ఈ రామన్‌దివోకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ప్రపంచస్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ల వివాహం అత్యంత ఆడంబరంగా జరిగింది. దీనికిముందు కుటుంబంతో కలిసి పెళ్లి వేదిక వద్దకు వస్తున్నప్పుడు ముకేశ్ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) చేతిలో కనిపించిన సంప్రదాయ చిహ్నం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది రామన్‌ దివో. దానిపై గణేశుడి ప్రతిమ దర్శనమిచ్చింది. గుజరాతీ పెళ్లిళ్లలో ఈ రామన్‌దివోకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వివాహ వేదిక వద్దకు వరుడు తరలివస్తున్న సమయంలో అతడి తల్లి దానిని తనవెంట తీసుకువస్తుంది. ఈ ల్యాంప్‌ను శుభ్రపదంగా భావిస్తారు. అది చీకటిని పారదోలి, కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందిస్తుందని విశ్వసిస్తారు. కుమారుడి పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఉద్వేగానికి గురయ్యారు. వివాహానికి వచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పిల్లలు శాశ్వత బంధంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని చూస్తుంటే.. తన మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందనీ భక్తిభావంతో ఉప్పొంగుతోందనీ అన్నారు. హిందూ సంప్రదాయంలో వివాహం అనేది ఈ జన్మకు మాత్రమే సంబంధించినది కాదనీ అది ఏడు జన్మలకు చేసుకునే వాగ్దానమని అతిథులను ఉద్దేశించి మాట్లాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.