Palazzo Pants: ఈ ఫ్యాంట్‌ ధర అక్షరాలా రూ.60 వేలు.. ఇప్పుడిదే లేటెస్ట్‌ ఫ్యాషన్‌మరి..! వీడియో.

Palazzo Pants: ఈ ఫ్యాంట్‌ ధర అక్షరాలా రూ.60 వేలు.. ఇప్పుడిదే లేటెస్ట్‌ ఫ్యాషన్‌మరి..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 27, 2023 | 9:01 AM

మార్కెట్‌లో రోజుకో కొత్తరకం ఫ్యాషన్‌ పుట్టుకొస్తోంది. ఫ్యాషన్‌ పేరుతో డిజైనర్లు వింత వింత బట్టలు తయారు చేస్తున్నారు. జనాలు కూడా వెర్రి వెయ్యి రకాలు అన్నట్లు వాటికోసం ఎగబడుతున్నారు.

మార్కెట్‌లో రోజుకో కొత్తరకం ఫ్యాషన్‌ పుట్టుకొస్తోంది. ఫ్యాషన్‌ పేరుతో డిజైనర్లు వింత వింత బట్టలు తయారు చేస్తున్నారు. జనాలు కూడా వెర్రి వెయ్యి రకాలు అన్నట్లు వాటికోసం ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ జనాలు ఎగబడుతోంది దేనికో తెలుసా… ఓ గోనెసంచి కోసం. అదికూఆ వేలకు వేలు వేలు పెట్టి కొనేస్తున్నారు. ఇంతకీ ఆ కొత్తఫ్యాషన్‌ ఏంటంటే.. ఓ డిజైనర్‌ బియ్యం, గోదుమలు ఇలా తదితర వస్తువులను రవాణా చేసేందుకు ఉపయోగించే గోనెసంచితో ఫ్యాంట్‌ డిజైన్‌ చేశాడు. అదేదో సరదాకి కాదు.. గోనెసంచితో పలాజో ప్యాంట్‌ కుట్టి అమ్మకానికి పెట్టాడు. గోనె సంచేకదా.. చాలా చీఫ్‌గా ఉంటుంది అనుకుంటే పొరబాటే.. దాని ధర కూడా అదిరిపోతుంది. ఏకంగా ఒక్క ప్యాంట్‌ ఖరీదు 60 వేల రూపాయలట. గోనె సంచితో ప్యాంటు తయారు చేయడమే వింతగా ఉంటే.. ఇంత రేటు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ పలాజో ప్యాంట్ ని వీడియో తీసి ‘సచ్ కద్వా హై’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో అప్ లోడ్ చేశారు. ‘ఈ పలాజోని 60,000 పెట్టి కొంటారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇంకేముంది లక్షల్లో లైక్ లు.. వేలల్లో కామెంట్లు. ‘ఆ అంత ధర పెట్టి గోనె సంచిని ఎవరు కొంటారులే!’ అని అనుకోకండి. చాలామంది ఈ గోనె సంచి పలాజోని ఎగబడి కొంటున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 27, 2023 09:01 AM