Viral: నీటిపై తేలియాడే ఎమ్మెల్యే ఎవరో తెలుసా..? నీటిపై తేలియాడుతూ ప్రదర్శన..

|

Jul 17, 2023 | 3:59 PM

కేవలం నేలపై యోగా చేస్తే అందులో థ్రిల్ ఏముంటుంది.. అందుకే ఈ జాతీయ స్విమ్మింగ్ పూల్ డే దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ విభిన్నంగా జరుపుకున్నారు. నీటిపై తేలియాడుతూ ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

జాతీయ స్విమ్మింగ్ పూల్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈత, ఆక్వా యోగా పై అవగాహన కల్పించేందుకు డెప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ లో యోగాసనాలను చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. 64ఏళ్ల వయసులో.. 113 కేజీల బరువుతో ఉన్నా డిప్యూటీ స్పీకర్ శ్వాస నియంత్రణతో గంటపాటు నీటిలో ఆసనాలు వేశారు. శవాసనంతో పాటు పద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదంతా కూడా డెప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి బొత్స సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ప్రజాప్రతినిధుల మధ్య చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. యోగా అంటే తెలియని వారు సైతం ఈ ఆసనాలు చూసి తాము కూడా యోగా నేర్చుకోవడానికి నిర్ణయించడం విశేషం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...