తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో.. గుండెల్ని పిండేసే స్టోరీ

Updated on: May 20, 2025 | 2:31 PM

గుర్గావ్‌లో పంకజ్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే, రోజూ తనతో పాటు తన రెండేళ్ల చిన్నారిని కూడా వెంట తీసుకెళతాడు. స్విగ్గీ డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో అతడిని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు. చిన్న పిల్లను ఎందుకు ఇలా తిప్పుతున్నావు? అంత కష్టంగా ఉంటే ఇంట్లోనే ఉండూ అని నానా మాటాలు కూడా అన్న వారున్నారు.

అయితే, వారి మాటలను విని చిన్నగా నవ్వేస్తూ సైలెంట్‌గా వెళ్లిపోతుంటాడు. ఈ క్రమంలోనే ఓ లోకల్‌ కంపెనీ సీఈఓ అగర్వాల్‌ వద్దకు ఫుడ్ డెలివరీ చేయడానికి పంకజ్ తన రేండేళ్ల చిన్నారితో వెళ్లాడు. ఫుడ్ ఆర్డర్ వచ్చిందని సీఈఓకి ఫోన్ చేసి చెప్పగా అతడు పంకజ్‌ను సెకండ్ ఫ్లోర్‌కి రండి అని పిలిచాడు. అయితే, ఇంతలోనే పంకజ్ కూతురు అరుపులు వినిపించాయి. మీతో చిన్న పిల్లలు ఉన్నారా? అని పంకజ్‌ను అడిగాడు. అవునంటూ పంకజ్‌ సమాధానం చెప్పడంతో కంపెనీ సీఈఓ ఫుడ్ తీసుకునేందుకు కిందికి వెళ్లాడు. పంకజ్‌తో రేండేళ్ల చిన్నారిని చూసి ఎందుకు పాపను ఇలా తీసుకొచ్చావు అని ప్రశ్నించాడు. దీంతో అతను తన ఎమోషనల్ స్టోరీని పంచుకున్నాడు. తన కూమార్తె బాగోగులు చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరని, అతని భార్య ప్రసవ సమయంలో చనిపోయిందని చెప్పాడు. అతని పెద్ద కొడుకు క్లాసెస్‌కి హాజరవుతాడాని, అందుకే ఫుడ్‌ డెలివరీ సమయంలో తన రేండేళ్ల చిన్నారిని తనతోపాటే తీసుకువెళ్తానని చెప్పుకొచ్చాడు. అతడి విషాద కథను విన్న కంపెనీ సీఈఓ మయాంక్‌ అగర్వాల్.. పంకజ్‌కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ పంకజ్‌ తనకు డబ్బు అవసరం లేదని, తన కూమార్తెను తాను చూసుకోగలనని చెప్పాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రేజీ అప్‌డేట్‌! బుర్జ్ ఖలీఫాపై.. పవన్‌ కల్యాణ్‌ “హరిహర” ట్రైలర్ రిలీజ్‌

AI ఆస్పత్రి.. రోబోలే డాక్టర్లు, నర్సులు.. ఎక్కడంటే ??

గాల్లో విమానం.. పైలట్‌ లేకుండా ప్రయాణం..

మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి ఇలా

వామ్మో.. పెద్దపులి వచ్చింది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..