Special Food: ఇప్పుడు ఆర్డర్‌ చేస్తే 30 ఏళ్లకు డెలివరీ.. ఓపికుంటే వెయిట్‌ చేయండి..!

Updated on: Nov 23, 2022 | 9:33 AM

సాధారణంగా బాగా ఆకలి వేస్తున్నప్పుడు, ఇంటికి వెళ్లి వంట చేసేంత తీరిక, ఓపిక లేనప్పుడు వెంటనే ఫుడ్‌ ఆర్డర్‌ చేసేస్తాం. అంతే క్షణాల్లో మనముందు వేడి వేడి ఫుడ్‌ రెడీగా ఉంటుంది.


జపాన్ లో మాత్రమే తయారు చేసే ఈ ప్రత్యేక వంటకం పేరు క్రోక్విట్స్. చూడడానికి ఇవి ఆలూ కట్లెట్‌లా కనిపిస్తాయి. ఇది చాలా పాత వంటకం అట. గత 96 ఏళ్లుగా జపాన్ లో ‘ఆషియా’ అనే ఫ్యామిలీ మాత్రమే ఈ వంటకాన్ని తయారుచేస్తోందట. ఇప్పుడు ఈ వంటకాన్ని ఆషియా ఫ్యామిలీలోని మూడవతరానికి చెందిన షిగేరు నిట్టా అనే వ్యక్తి తయారు చేస్తున్నాడట. దీని తయారీకి స్థానికంగా పండించే బంగాళాదుంపలు, జపాన్ కు చెందిన కోబ్‌ అనే నల్లజాతి పశువుల గొడ్డు మాంసాన్ని ఉపయోగిస్తారట. అయితే ఈ పశువుల్లో 3 సంవత్సరాల వయసున్న పశువుల మాంసాన్ని మాత్రమే వినియోగిస్తారట. కాగా వీటిని వారంలో కేవలం రెండువందలు మాత్రమే తయారు చేస్తారట. అందుకే వీటిని ఎక్కువగా పంపిణీ చేయలేకపోతున్నారు. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ క్రోక్విట్స్ ను అమ్మడానికి ఆన్లైన్ స్టోర్ ను ఓపెన్ చేశారు. అప్పటి నుండి వీటిని ఆర్డర్ చేసుకోవడం మొదలు పెట్టారు చాలామంది. అయితే వీటిని ఆర్డర్‌ చేసిన 30 ఏళ్ల లోపు ఎప్పుడైనా డెలివరీ అవుతుంది. అన్ని సంవత్సరాల తరువాత నిజంగానే డెలివరీ ఇస్తారా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. అయితే 2013 సంవత్సరంలో ఓ మహిళ ఈ డిష్ ను ఆర్డర్ చేయగా తాజాగా ఆమెకు డెలివరీ ఇచ్చినట్టు పేర్కొంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పలేదు కదూ… దీని ధర 1600 రుపాయలు. ఇందులో అయిదు కట్లెట్ లాంటి పీస్ లు ఉంటాయి. 2000 సంవత్సరంలో ఈ క్రోక్విట్స్ గురించి ఓ న్యూస్ పేపర్ ప్రచురించడంతో ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి తెలిసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 23, 2022 09:33 AM