పోలీసుల వినూత్న ఆలోచన.. సినిమా డైలాగులు, మీమ్స్‌తో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. నెటిజన్లకు ఏది చెప్పాలన్నా మీమ్స్ రూపంలో చెప్పాలి లేదంటే సినీ స్టయిల్లోనైనా చెప్పాలి. అప్పుడే వాళ్లు ఆ విషయాన్ని చక్కగా బుర్రకెక్కించుకుంటారు.
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. నెటిజన్లకు ఏది చెప్పాలన్నా మీమ్స్ రూపంలో చెప్పాలి లేదంటే సినీ స్టయిల్లోనైనా చెప్పాలి. అప్పుడే వాళ్లు ఆ విషయాన్ని చక్కగా బుర్రకెక్కించుకుంటారు. ఇదే ట్రిక్‌ను ఫాలో అయ్యారు ఢిల్లీ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రచారం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తూ.. సినిమా డైలాగ్‌లతో కూడిన మీమ్‌తో ప్రచారం చేశారు. ఢిల్లీ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ కారు రెడ్‌లైట్‌ను దాటుకుని వేగంగా దూసుకెళ్తుంది. రెడ్‌లైట్‌పై కరీనాకపూర్ ఫొటో ప్రత్యక్షమవుతుంది. ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రంలోని కరీనాకపూర్ పాత్ర చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. ‘అతను ఎవరు.. కనీసం నావైపైనా తిరిగి చూడలేదు’ అనే డైలాగ్ చెప్తుంది. ‘ఆ ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి ఎవరు.. మిమ్మల్ని ఇష్టపడుతున్నది… ఒక్కసారి ఆ రెడ్‌లైట్ వంక చూడండి’ అని ఈ వీడియోకు పోలీసులు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. అంతేకాదు వీడియోను లైక్ చేస్తూ పోలీసుల ఐడియాని తెగ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ananya Panday: పాపకు ఇలాంటివి 1stటైం అనుకుంటా..ఓ.. ఎగ్జైట్ అయిపోతుందిగా
Vijay Deverakonda: ‘వీడిలాంటోడు ఇంకోడుండడు..’ యూబ్యూబ్‌ని రఫ్ఫాడిస్తున్న రౌడీ
Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!