లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టింది

Updated on: Oct 29, 2025 | 4:24 PM

ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువకుడి అనుమానాస్పద మృతి కేసులో కుట్ర కోణం బయటకు వచ్చింది. రామ్ కేశ్‌తో అమృతకు ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. ఇద్దరూ గాంధీ విహార్ ఫ్లాట్‌లో ఉండేవారు. ఆ సమయంలో రామ్ కేశ్ ఆమె వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి హార్డ్‌డిస్క్‌లో భద్రపరిచాడు. వాటిని డిలీట్ చేయమని ఆమె కోరినా రామ్ కేశ్‌ నిరాకరించాడు.

దీంతో అమృతా ఈ విషయం తన మాజీ ప్రియుడు సుమిత్‌కు చెప్పింది. ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలని భావించిన సుమిత్, అమృతా.. హత్యచేసి అగ్నిప్రమాదంలా చిత్రీకరించాలని కుట్ర పన్నారు. మాజీ ప్రియుడి సాయం తీసుకుని ఘాతుకానికి పాల్పడింది అమృత. ఆమెతో పాటు తన మాజీ ప్రియుడు, వారి స్నేహితుడు కలిసి రామ్ కేశ్ గొంతు నులిమి చంపేసి, నెయ్యి, వైన్ పోసి శవాన్ని తగులబెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. అక్టోబర్ 6న అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. తర్వాత నాలుగో అంతస్తులోని ఒక ఫ్లాట్‌ నుంచి కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం సివిల్స్‌కు సిద్ధమవుతున్న 32 ఏళ్ల రామ్ కేశ్ మీనాదని గుర్తించారు. రామ్‌కేశ్‌ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో ముందు రోజు రాత్రి ముఖాలకు మాస్క్‌లు ధరించిన ఇద్దరు అక్కడకు రాగా.. కొద్దిసేపటికే ఒకరు బయటకు వెళ్లినట్లు రికార్డయ్యింది. ఆ తర్వాత ఒక యువకుడు, ఒక మహిళ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమెను రామ్ కేశ్‌ లివ్-ఇన్ పార్ట్‌నర్ అమృత చౌహాన్‌గా గుర్తించారు. వారు వెళ్లిన కొద్ది సేపటికి మంటలు చెలరేగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ బయటపెట్టింది. అలాగే, ఆ సమయానికి అమృత ఫోన్ రామ్ కేశ్ ఫ్లాట్ సమీపంలో ఉన్నట్లు కాల్ రికార్డులు ధ్రువీకరించాయి. దాంతో పోలీసులు హత్యగా అనుమానించి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఘటన తర్వాత అమృత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఆమె కోసం గాలించిన పోలీసులు అక్టోబర్ 18న పట్టుకున్నారు. విచారణలో మాజీ ప్రియుడు సుమిత్, స్నేహితుడు సందీప్ తో కలిసి హత్యచేసినట్టు తెలిసింది. దీంతో సుమిత్‌ను అక్టోబర్ 21న, సందీప్‌ను అక్టోబర్ 23న పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ ఏజెన్సీలో సుమిత్ పని చేస్తుండటంతో సిలిండర్ పేలడానికి పట్టే సమయం గురించి అతడికి అవగాహన ఉంది. ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని అయిన అమృతకు క్రైమ్ వెబ్‌- సిరీస్‌లు చూసే అలవాటు ఉంది. వీటితో ప్రేరణ పొంది ఈ హత్యకు ప్రణాళిక వేసింది. వీరికి మిత్రుడు సందీప్ కుమార్ సహకరించాడు .అక్టోబర్ 5 రాత్రి ముగ్గురూ రామ్ కేశ్ ప్లాట్‌కు వెళ్లారు. అమృత కొద్ది దూరంలో ఉండిపోగా సుమిత్, సందీప్‌లు లోపలికి వెళ్లి రామ్ కేశ్ పై దాడిచేసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై నూనె, నెయ్యి, వైన్ పోసి తగలబెట్టారు. గ్యాస్ సిలిండర్‌ను వంటగదిలో నుంచి తీసుకువచ్చిన సుమిత్.. దానిని మృతదేహం తల దగ్గర ఉంచి, వాల్వ్ తెరిచాడు. అనంతరం రామ్ కేశ్ ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్, ఇతర వస్తువులు తీసుకుని వెళ్లిపోయారు. అన్ని సర్దుకుని సుమిత్ లైటర్‌ వెలిగించి తలుపు మూసేశాడు. గంట తర్వాత సిలిండర్ పేలిపోయింది. వారు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసినా సీసీటీవీ కెమెరాలతో దొరికిపోతామని ఊహించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్సర్ రోగుల కోసం కదిలిన ఒడిశా కేశదాత హరప్రియ

వీధి కుక్కల ఆకలి తీర్చి.. సొంత ఖర్చుతో వ్యాక్సిన్లు వేయిస్తున్న ఒడిశా వాసి

కొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. ఏం జరిగిందంటే..

నవంబరు 1 నుంచి మారనున్న ఆధార్‌ రూల్స్‌

కాలజ్ఞాన మహిమ.. నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపుంజు