ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా పైలట్, స్పైస్‌జెట్ ప్రయాణికుడిపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. క్యూలో దూరినందుకు ప్రశ్నించగా, పైలట్ దుర్భాషలాడి శారీరకంగా దాడి చేసినట్లు ప్రయాణికుడు ఆరోపించాడు. దీనిపై ఎయిరిండియా స్పందిస్తూ, పైలట్‌ను విధుల నుంచి తొలగించి, ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించింది. ప్రయాణికుల భద్రత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది.
ఎయిరిండియా కు చెందిన పైలట్ తనపై దాడి చేసినట్లు స్పైస్‌జెట్ విమాన ప్రయాణికుడు అంకిత్ దివాన్ ఆరోపించారు . ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించింది. పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో ఈ ఘటన జరిగింది. అంకిత్ పోస్టు ప్రకారం.. నాలుగు నెలల కుమార్తెతో సహా కుటుంబంతో కలిసి స్పైస్‌జెట్ లో ప్రయాణించేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు చెప్పారు. సిబ్బంది ఉపయోగించే సెక్యూరిటీ చెక్-ఇన్ లైన్‌లో వెళ్లాలని తనకు అక్కడున్నవారు సూచించారనీ తాము ఉన్న క్యూలోకి కొందరు మధ్యలో దూరిపోవడంతో.. వారిని ప్రశ్నించాననీ రాసుకొచ్చారు. ఎయిరిండియా పైలట్ వీరేందర్ కూడా అలాగే చేయడంతో.. అతడిని కూడా ప్రశ్నించాననీ అన్నారు. ఈ క్రమంలో అతడు తన పై దుర్భాషలాడాడనీ అనంతరం తమ మధ్య వాగ్వాదం జరిగిందనీ సంయమనం కోల్పోయిన పైలట్ తన పై భౌతిక దాడి చేసాడని ఆరోపించారు. ఈ పోస్టుకు రక్తపు మరకలతో ఉన్న తన ముఖాన్ని ఫోటో తీసి దానిని అంకిత్ షేర్ చేసారు. పైలట్ చొక్కాపై ఉన్న రక్తపు మరకలు కూడా తనవేనని తెలిపారు. తన ఏడేళ్ల కుమార్తె ఈ ఘటనతో చాలా భయపడిందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఘటన ఇక్కడితో వదిలేసేలా ఓ లేఖ రాయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేశారు. ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ స్పందించింది. పైలట్ ప్రవర్తనను ఖండిస్తున్నట్లు తెలిపింది. సంబంధిత ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ సంస్థ ఉద్యోగులు ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలా అయిపోతున్నారేంట్రా.. హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్‌అప్స్.. అక్కడ నుండి..
Boyapati Sreenu: ట్రోల్స్ పై బోయపాటి రియాక్షన్.. ఆల్రెడీ హమ్‌నే కాషన్ కీయ