జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో
జింకల సంఖ్యను పెంచడానికి, వాటికి ఆహార కొరత లేకుండా చేయడానికి అటవీ అధికారులు జింకలను ఒక అడవి నుంచి మరో అడవికి తరలిస్తూ ఉంటారు.
జింకల సంఖ్యను పెంచడానికి, వాటికి ఆహార కొరత లేకుండా చేయడానికి అటవీ అధికారులు జింకలను ఒక అడవి నుంచి మరో అడవికి తరలిస్తూ ఉంటారు. దీనివల్ల వాటికి ఆహార సమస్య తీరుతుంది. అన్ని అడవుల్లో జింకలు పెరుగుతాయి… అంతే కాకుండా వీటి ద్వారా వన్య వృగాలకు కూడా ఆహారం దొరుకుతుంది. తాజాగా అలాంటి ఓ సందర్భాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్. జింకలకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదట. గతేడాది ఉదయం 5 గంటల సమయంలో ఆ వీడియోని స్వయంగా తానే షూట్ చేసినట్లు పర్వీన్ కస్వాన్ తెలిపారు. అందులో అటవీ అధికారులు కొన్ని వాహనాల్లో ఓ అడవిలోకి వెళ్లారు. ఓ వ్యానులో పెద్ద సంఖ్యలో జింకల్ని తీసుకొచ్చారు. అక్కడ వ్యాన్ డోర్ తెరవగానే… జింకలు గుంపులు గుంపులుగా ఎగురుతూ అడవిలోకి పరుగులు పెట్టాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో