చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు మరవలేక
తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన కూతురు అలక, అపూర్వ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి జిల్లాలో తన తండ్రి హనుమంత్ రావు జ్ఞాపకార్థం 12 లక్షల ఖర్చుతో, 14 నెలల శ్రమతో అచ్చం తండ్రి పోలికలతో కూడిన సిలికాన్ విగ్రహాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసింది. ఈ జీవకళ ఉట్టిపడే ప్రతిమ ద్వారా తండ్రి ఎప్పుడూ తన కళ్లముందే ఉన్నట్లు ఆమె ఆనందిస్తోంది. ఇది తండ్రిపై ఆమెకు గల అపారమైన ప్రేమకు నిదర్శనం.
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి సడన్ గా చనిపోవడాన్ని ఆ కూతురు తట్టుకోలేకపోయింది. రెండేళ్లు గడుస్తున్నా తండ్రి జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోయింది. భౌతికంగా దూరం అయిన తండ్రి తన కళ్ల ముందే కనిపించేలా ఏదైనా చేయాలని ఆలోచన చేసిన ఆమె.. అచ్చం తండ్రిలాంటి ప్రతిమను తయారు చేయించుకుంది. దానిని తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసింది. అది పేరుకు విగ్రహమే అయినా.. జీవకళ ఉట్టిపడుతోందని.. గ్రామస్తులు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలో హనుమంత్ రావు అనే రైతు రెండేళ్ల క్రితం హార్ట్ ఎటాక్ తో మరణించాడు. హనుమంతరావు ఏకైక కుమార్తె అలక మెంగే, ఆమె భర్త ప్రవీణ్ కుమార్. వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ ఇద్దరూ కలిసి ఊరి శివారులో మెయిన్ రోడ్డులో ఉన్న సొంత భూమిలో.. సిలికాన్ తో హనుమంత్ రావు ప్రతిమను ఏర్పాటు చేయించారు. ఆయన ఊయలపై కూర్చున్నట్లుగా ఏర్పాటు చేయించారు. ఆయన సజీవంగా లేకపోయినా.. విగ్రహంలో మాత్రం జీవకళ ఉట్టిపడేలా తయారుచేయించారు. ఈ సిలికాన్ విగ్రహం గురించి యూట్యూబ్ లో వెదికి ఆర్డరిచ్చారు. దీనికి 12 లక్షల ఖర్చు, 14 నెలలు సమయం పట్టింది. తన తండ్రి భౌతికంగా దూరం అయినా.. ఈ ప్రతిమ వల్ల ఎప్పటికీ కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తోందని ఆమె చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవంబరులో నింగిలో అన్నీ అద్భుతాలే
సుడిగాడు.. కొంచెం ఉంటే బస్సు చక్రాల కిందే
