19 ఏళ్లకు వరించిన అదృష్టం.. వేల మందికి విందు వీడియో
హర్యానా రాష్ట్రం అన్ని రంగాలలో పురోగతి సాధించినప్పటికీ లింగ నిష్పత్తిలో ఇంకా వెనుకబడే ఉంది. అక్కడ వెయ్యి మంది పురుషులకు 910 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంపై ఎక్కువ దృష్టిపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి హర్యానాలో అరుదైన ఘటన జరిగింది. జింద్‌లోని తువా గ్రామం వ్యవసాయ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసేలా చేసింది. రెండు దశాబ్దాల తర్వాత ఆడబిడ్డ పుట్టడంతో వాళ్లంతా పండుగ చేసుకున్నారు. చుట్టుపక్కల 21 గ్రామాల నుంచి 8 వేల మందిని పిలిచి విందు ఏర్పాటు చేశారు.
సురేంద్ర , కృష్ణ దంపతులకు పెళ్లైన 19 ఏళ్లకు ఆడబిడ్డ పుట్టింది. పాపకు భూమి దేవి అని పేరు పెట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తమ ఇంట్లో ఆడపిల్ల పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమకు పిల్లలు పుట్టరని భావించి మేనల్లుడిని దత్తత తీసుకున్నారు. ఆ వేళా విశేషమో ఏమో కానీ జూలైలో ఎలాంటి వైద్య చికిత్స తీసుకోకుండానే ఆ ఇంట్లో అద్భుతం జరిగింది. పూజా తంతును నిర్వహించాక .. గ్రామస్తులు, బంధువులు, చుట్టు పక్కన గ్రామాల వారిని పిలిచి.. దాదాపు 8 వేల మందికి విందును ఏర్పాటు చేశారు. దాదాపు 25 ఖాప్‌ల నుంచి సర్పంచ్‌లు నవజాత శిశువును చూడటానికి రావడం విశేషం. హర్యానా గ్రామస్తుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడంలో ఈ కార్యక్రమం విజయం సాధించిందని చాలా మంది ప్రశంసించారు. తమ కుమార్తె ఒక వరమని సాధారణంగా కొడుకులు పొందే ప్రతి గౌరవానికి ఆమె కూడా అర్హురాలేననే సందేశాన్ని చాటాలని అనుకున్నట్లు తండ్రి సంతోషంగా చెప్పారు. తమకు సొంత బిడ్డ పుట్టడం తమ జీవితాల్లో ఆనందం నింపిందనీ. అలాగని దత్తత కొడుకు మీద ప్రేమ ఏ మాత్రం తగ్గదు అని ఆ తల్లి చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం :