ఎంతకు తెగించావురా !! రీల్స్‌ కోసం ఇంత రిస్క్‌

Updated on: Jan 03, 2026 | 11:22 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి ప్రాణాలను పణంగా పెట్టి బైక్‌పై నిప్పుల కుండలతో ప్రయాణించాడు. చలి సాకుతో చేసిన ఈ ప్రమాదకర విన్యాసం ఫేమ్ కోసమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి రిస్కులతో కూడిన స్టంట్స్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు విలువైనవి అని గుర్తుచేస్తున్నారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మరికొంతమంది వెర్రి వేషాలు వేస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి నెపంతో ఓ వ్యక్తి బైక్‌పైన నిప్పుల కుండలు పెట్టుకొని రయ్‌..య్‌..మంటూ దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో వ్యక్తి తన శరీరం మొత్తాన్ని గడ్డితో చుట్టుకుని.. బైంక్ హ్యాండిల్ బార్లకు రెండు కుండలను కట్టుకుని, తలపైన ఒక కుండ, బైక్‌ బ్యాక్‌ సీటుపైన ఒక కుండ కట్టుకున్నాడు. ఆ కుండలలో నుంచి మంటలు ఎగసిపడుతుండగా బైక్‌పై దూసుకెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇంత ప్రమాకరమైన స్టంట్లు అవసరమా? అని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 13 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. వందలాది మంది కామెంట్లు పెడుతున్నారు. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి ఇలాంటి స్టంట్లు చేయడం అవసరమా? అని మండిపడుతున్నారు. ‘రీల్ కోసం ఇంత రిస్కా? జీవితం చాలా విలువైనది సోదరా!’ అని మరొకరు రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిలోకి ప్రవేశించిన చిరుత.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌

కోహ్లీ, రోహిత్‌ గురించి పఠాన్‌ అంత మాటనేశాడేంటి ??

శ్రీశైలంలో చిరుత హల్చల్‌.. పూజారి ఇంటి ఆవరణలో

‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు

ఘోరమైన పాపం చేశావ్.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న మత పెద్దలు