దోమ కాటేస్తే అంతే సంగతులు.. డెంగ్యూ కొత్త మ్యూటెంట్..11 రాష్ట్రాల్లో కల్లోలం.. వీడియో
దోమే కదా అని నిర్లక్ష్యం చేశారో అంతే సంగతులు. ఇకపై దోమ కాటుకు గురయ్యారంటే వెంటిలేటర్ వరకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే, దోమలు అప్‌డేట్ అయ్యాయ్. మరింత శక్తివంతంగా రూపాంతరం చెందాయి.
దోమే కదా అని నిర్లక్ష్యం చేశారో అంతే సంగతులు. ఇకపై దోమ కాటుకు గురయ్యారంటే వెంటిలేటర్ వరకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే, దోమలు అప్‌డేట్ అయ్యాయ్. మరింత శక్తివంతంగా రూపాంతరం చెందాయి. న్యూపవర్‌తో జనంపై అటాక్ చేస్తున్నాయి. అవును, ఇప్పటివరకు ఒక లెక్క… ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా దోమలు మరింత పవర్‌ఫుల్‌గా మారాయి. డెంగ్యూ దోమలు కొత్త మ్యూటెంట్‌ను తయారు చేసుకున్నాయి. దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ న్యూ వేరియంట్ ఇప్పుడు అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణతోపాటు గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో డెంగ్యూ కొత్త మ్యూటెంట్ బీభత్సం సృష్టిస్తోంది. న్యూ వేరియంట్ దెబ్బకు ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: RRR: అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్.. ఆర్.ఆర్.ఆర్ టీషర్ట్‌లు వచ్చేసాయోచ్.. వీడియో