డేటింగ్‌ యాప్‌ లింక్ నొక్కాడు.. లైన్లోకి ఇద్దరమ్మాయిలు.. అంతలోనే ట్విస్ట్

|

Sep 08, 2022 | 9:47 AM

యువత బలహీనతను ఆసరా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. హాయ్‌ అన్న చిన్న పదానికి స్పందిస్తే చాలు గంటల వ్యవధిలోనే వాట్సాప్‌ ద్వారా వచ్చే కాల్స్‌ను వద్దనుకున్నా..

యువత బలహీనతను ఆసరా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. హాయ్‌ అన్న చిన్న పదానికి స్పందిస్తే చాలు గంటల వ్యవధిలోనే వాట్సాప్‌ ద్వారా వచ్చే కాల్స్‌ను వద్దనుకున్నా.. టచ్‌ చేసి తీరుతారు. అందులో నగ్నంగా కనిపించే యువతి ఫొటోను మీరు గమనిస్తుండగా స్క్రీన్‌ షాట్‌ తీసి మళ్లీ మీకే పంపుతారు. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌.. వేధింపులు షరామాములే. అవతలి వారు డిమాండ్‌ చేసిన మేరకు డబ్బు చెల్లించుకోకపోతే మానసిక వేదన తప్పదు. ఈ తరహా చిక్కులో పడి ఎందరో నలిగి పోతున్నారు. వారిలో కొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు వలపుల వలలో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువకుడు వలపుల వలలో చిక్కుకుని తన చదువుల కోసం దాచుకున్న డబ్బు కాస్త బ్లాక్‌మెయిలర్‌ చెప్పిన ఖాతాకు జమ చేశాడు. ఇంతటితో విషయాన్ని ఆపలేదు. చాలారోజుల క్రితం రాజస్తాన్‌లోని భరత్పూర్‌కు చెందిన ఓ ముఠాను తెలంగాణా పోలీసులు అరెస్ట్‌ చేసి 25 కోట్లు కాజేసినట్లు నిర్ధారించారు. 18 రాష్ట్రాల్లో ఈ ముఠా తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌ బుక్‌తో చాటింగ్‌ ప్రారంభించి…వాట్సప్‌తో వసూళ్లకు దిగుతున్న ఈ ముఠాలతో తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు అనంత పోలీసులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైకి చూస్తే చెరుకు తోట.. లోపలికెళ్ళి చూసిన పోలీసులకు.. మాములు సెటప్ కాదుగా

జీవితంలో ఇలాంటి బోటును చూసి ఉండరు !! 60 ఏళ్ల వయసులో గిన్నిస్‌ రికార్డు కొట్టిన హాన్సెన్‌

అనుభవించు రాజా.. పుట్టింది పెరిగింది ఇందుకే.. మనుషులకే అసూయ పుట్టిస్తున్న చింపాంజీ

ప్రేమ పేరుతో వంచన !! మైనర్ బాలికను గర్భవతి చేసి మరీ ??

తాగివచ్చి భార్యను వేధిస్తున్న భర్త.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌ !!

 

Follow us on