పెంపుడు కుక్క విశ్వాసం !! యజమాని ఆకలి తీర్చడానికి రోజూ 2 కి.మీ. నడిచి..

|

Jun 08, 2022 | 9:04 AM

విశ్వాసానికి మారు పేరు కుక్క. అవి తన యజమానుల పట్ల ఎంతో ప్రేమ, భక్తి కలిగి ఉంటాయి. యజమాని ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణం నుంచి తిరిగి వచ్చే వరకూ ఆ కళ్లు నిరీక్షిస్తూనే ఉంటాయి.

విశ్వాసానికి మారు పేరు కుక్క. అవి తన యజమానుల పట్ల ఎంతో ప్రేమ, భక్తి కలిగి ఉంటాయి. యజమాని ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణం నుంచి తిరిగి వచ్చే వరకూ ఆ కళ్లు నిరీక్షిస్తూనే ఉంటాయి. తన యజమానికి ఏదైనా ఆపద సంభవిస్తుందటే ప్రాణాలకు తెగించి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన యజమాని పట్ల ఆ కుక్క బాధ్యతకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో…ఓ అందమైన జర్మన్ షెపర్డ్ కుక్క తన యజమాని కోసం లంచ్ బాక్స్‌ తీసుకెల్తోంది. ఇంటి నుంచి ఆఫీస్‌కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. టిఫిన్‌ బాక్స్‌ నోట కరచుకుని రోడ్డుపై వేగంగా నడుస్తూ..తన యజమాని కార్యాలయానికి జాగ్రత్తగా మోసుకెళ్తుంది. అక్కడ అతడి భోజనం ముగిసిన తరువాత తిరిగి ఖాళీ బాక్స్‌తో ఇంటికి చేరుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ ! అంతా పథకం ప్రకారమేనా ?

Follow us on