Lizard in Biryani: చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది.! వీడియో వైరల్..

|

Dec 04, 2023 | 7:28 PM

ప్రస్తుతకాలంలో అంతా ఆన్‌లైన్‌ మయం. షాపింగ్‌ మొదలు ఆహారం వరకూ అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవడమే. గతంలో ఎంత ఆలస్యమైనా ఆడవారు ఇంట్లో వంటచేసి అందరికీ వడ్డించే పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం కాలం మారింది. ఎంత ఆలస్యమైనా, ఎంతమందికైనా నిమిషాల్లో ఆహారం అందించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ అవసరమైనప్పుడు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటున్నారు.

ప్రస్తుతకాలంలో అంతా ఆన్‌లైన్‌ మయం. షాపింగ్‌ మొదలు ఆహారం వరకూ అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవడమే. గతంలో ఎంత ఆలస్యమైనా ఆడవారు ఇంట్లో వంటచేసి అందరికీ వడ్డించే పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం కాలం మారింది. ఎంత ఆలస్యమైనా, ఎంతమందికైనా నిమిషాల్లో ఆహారం అందించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ అవసరమైనప్పుడు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటున్నారు. ఇష్టమైన ఆహారం క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. వేడి వేడిగా ఆరగించేస్తున్నారు. మరి ఈ ఆన్‌లైన్‌ ఆహారం నాణ్యత విషయానికి వచ్చేసరికి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఓ కస్టమర్‌ ఆన్‌లైన్‌లో ఫిష్ బిర్యానీ ఆర్డర్‌ చేశారు. దానిలో ఫిష్‌తో పాటు బొద్దింకను కూడా సప్లయ్‌ చేశారు. అది చూసి కస్టమర్‌ ఖంగుతిన్నాడు. అది మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. చికెన్‌ బిర్యానీలో బల్లి కనిపించింది.

హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేసిన విశ్వ అనే బాలుడికి వింత అనుభవం ఎదురైంది. జొమాటో యాప్ నుంచి ఆన్‌లైన్‌లో బిర్యానీని ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ ఆర్డర్‌ తీసుకొచ్చి ఇచ్చాడు. వెంటనే విశ్వ బిర్యానీ తిందామని ప్యాకెట్‌ ఓపెన్‌ చేశాడు. అందులో చికెన్ తో పాటు బల్లి కూడా కనిపించింది. దీంతో షాక్ తిన్న బాలుడు ఆ బిర్యానీని తన తల్లికి చూపించాడు. వెంటనే విశ్వ తల్లి ఈ విషయాన్నీ జొమాటో కంపెనీతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి రెస్టారెంట్ సిబ్బందికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే హోటల్ యాజమాన్యం వీరి ఫిర్యాదుపై స్పందించలేదు. దాంతో సౌమ్య తన కుటుంబంతో సహా గేట్ ముందు నిరసన తెలిపింది. బిర్యానీలో బల్లి గురించి తెలియడంతో రెస్టారెంట్ లో ఆహారం తింటున్న కస్టమర్స్ తాము తింటున్న ఆహారాన్ని వదిలి వెంటనే వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిరసనకు దిగిన ఫ్యామిలీ సహా అక్కడ ఉన్నవారిని పంపించి, హోటల్ ను మూసివేశారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలంటూ అధికారులను బాధిత ఫ్యామిలీ కోరింది. ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.