ఆ ఊరిలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఒక్కరూ బతికి లేరు.. అదే కారణమా?
ఆ గ్రామంలో 60 ఏళ్లు పైబడిన ఒక్క వ్యక్తి కూడా బతికి లేరు. వృద్ధాప్యం దగ్గరికి వచ్చేలోపు అందరూ మూత్రపిండాల వైఫల్యంతో ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో గ్రామస్థులు తమ గ్రామానికి శాపం తగిలిందని అంటున్నారు. వృద్ధులు లేని ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరికి పట్టిన శాపమేంటో చూద్దాం. ఒడిశాలోని సెల్మాపాలి గ్రామంలో 300 మంది ప్రజలు జీవిస్తున్నారు.
ప్రతి కుటుంబంలో కనీసం ఒక కిడ్నీ రోగి ఉన్నారు. తమ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉందని, అక్కడ వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని స్థానికులు అంటున్నారు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో మిగతావారు సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే మందులు కొంత ఉపశమనం కలిగించినా, ఆస్పత్రికి వెళ్లాలంటే ఖర్చవుతోంది. కొంతమంది గ్రామస్థులు క్షయ, మానసిక అనారోగ్యం, గుండె జబ్బులతో కూడా బాధపడుతున్నారు. వైద్య బృందాలు గ్రామాన్ని సందర్శించి రక్త నమూనాలను చాలాసార్లు సేకరించాయని గ్రామస్థలు చెప్పారు. ఇప్పటికీ గ్రామస్థులు తాగునీటి కోసం బోర్‌ల పైనే ఆధారపడుతున్నారు. నీరు కలుషితమై ఉండవచ్చని వైద్య బృందాలు అనుమానిస్తున్నాయి. సెల్మాపాలి గ్రామ సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో గ్రామస్థులు తరచుగా లైసెన్స్ లేని నకిలీ వైద్యులను లేదా స్థానిక వైద్యుల దగ్గరకి వెళ్తారు. వ్యాధి ముదిరి సరైన ఆసుపత్రులకు చేరుకునే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. , ఏళ్ల తరబడి మంచానికి పరిమతమైన రోగుల కుటుంబాలు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇళ్లకు తాళాలు వేయరు.. క్రైమ్ రేట్ చాలా తక్కువ.. ఎక్కడంటే..?
సెల్ఫీ పిచ్చి ఎంత పని చేసింది.. ఎందుకు స్వామి వీళ్ళు ఇలా అయిపోతున్నారు
TOP 9 ET News: బాలయ్య సినిమాకు నేషనల్ అవార్డ్ | VD కెరీర్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్
ఏడాది ఆదాయం 3 రూపాయలే.. దేశంలోనే నిరుపేద వ్యక్తి ఇతడే
Kingdom: కింగ్డమ్‌కు అదిరిపోయే కలెక్షన్స్.. వెంకన్న సాక్షిగా కొట్టిపడేసిన కొండన్న!