Urvashi Radhadia: సింగర్‌పై కరెన్సీ వర్షం.. ఊర్వశి రాధాదియా గాత్రానికి ముగ్ధులైన అభిమానులు.

|

Sep 18, 2023 | 6:59 AM

గుజరాత్‌కు చెందిన ఫోక్ సింగర్ ఊర్వశీ రదాదియాపై నోట్ల వర్షం కురిసింది. ఆమె పాటకు మెచ్చిన అభిమానులు.. స్టేజీ మీద ఆమె పాడుతున్నంతసేపు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. దీంతో ఆ వేదిక మొత్తం నోట్లతో నిండిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అభిమానాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కచ్‌లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా స్థానికంగా సంగీత కచేరీని ఏర్పాటు చేశారు.

గుజరాత్‌కు చెందిన ఫోక్ సింగర్ ఊర్వశీ రదాదియాపై నోట్ల వర్షం కురిసింది. ఆమె పాటకు మెచ్చిన అభిమానులు.. స్టేజీ మీద ఆమె పాడుతున్నంతసేపు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. దీంతో ఆ వేదిక మొత్తం నోట్లతో నిండిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అభిమానాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కచ్‌లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా స్థానికంగా సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 14న జరిగింది. ఆమె గాత్రానికి మంత్రముగ్ధులైన అభిమానులు అదేపనిగా కరెన్సీ నోట్లను వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ఊర్వశీకి ఇలాంటి అరుదైన అనుభవమే ఎదురైంది. అహ్మదాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన ఊర్వశీ.. ఆ కార్యక్రమంలో వేదికపై కూర్చొని హార్మోనియా వాయిస్తూ పాటలు పాడారు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా ఊగిపోయారు. నోట్ల కట్టలను తీసి ఆమెపై వెదజల్లారు. మరికొందరైతే బకెట్ల నిండా డబ్బును నింపి.. ఆమెపై గుమ్మరించారు. ఆ సమయంలో డబ్బంతా ఆమె మీద పడడంతో అదంతా పక్కకు తీసి ప్రదర్శన చేపట్టారు. ఈ వీడియోనుకూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఆమె అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..