Hug Therapy: వారేవా..! బ్రిటన్‌లో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ ట్రీట్‌మెంట్‌.. కౌగిలింతతో లక్షలు సంపాదన..

|

Jul 19, 2022 | 10:26 AM

బ్రిటన్‌లో ఓ వ్యక్తి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ ట్రీట్‌మెంట్‌తో లక్షలు సంపాదిస్తున్నాడు. అవును యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన హూటన్‌ అనే వ్యక్తి ఓ ప్రొఫెషనల్‌ కడ్లర్‌. ఇతను తమ మనసులోని భావాల్ని


బ్రిటన్‌లో ఓ వ్యక్తి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ ట్రీట్‌మెంట్‌తో లక్షలు సంపాదిస్తున్నాడు. అవును యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన హూటన్‌ అనే వ్యక్తి ఓ ప్రొఫెషనల్‌ కడ్లర్‌. ఇతను తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి తన ట్రీట్‌మెంట్‌తో ఉపశమనం కల్పిస్తున్నాడు. ఇందుకు అతను ఎవరైనా బాధతో, ఆవేదనతో ఉన్నా.. ఒంటరి తనంతో దిగులుగా ఉన్నా వారిని కౌగిలించుకుంటాడు. బాధితులు చెప్పింది.. ఓర్పుగా వింటాడు.. వారి ఆందోళన తగ్గే విధంగా చేస్తాడు.. అయితే అతను ఇలా కడల్ థెరపీ ఇవ్వడానికి గంటకు 75 పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు 7వేల రూపాయలను వసూలు చేస్తాడు. ఇదేదో బావుందే అనుకుంటున్నారా… హూటన్‌ ఇదంత సులువు కాదంటున్నాడు. హూటన్‌ మొదట ఒంటరితనంతో మానసికంగా క్షోభ పడేవారికి స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతోనే దీనిని మొదలుపెట్టాడట. కాలక్రమంలో దీనినే వృత్తిగా స్వీకరించాడట. ఆంగ్ల వెబ్‌సైట్ మిర్రర్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. హూటన్ కొన్ని నెలల క్రితం ఈ వ్యాపారాన్నిమొదలు పెట్టాడు. ఈ సంస్థ ఒక్క కౌగిలింతలతో ఓదార్పుని వ్వడమే కాదు.. ‘కనెక్షన్ కోచింగ్’ వంటి సేవలను కూడా అందిస్తుంది. ఇది ఇతరులతో బంధాన్ని అనుబంధాన్ని పెంపొందించుకునే విధంగా వ్యక్తులకు సహాయపడుతుంది. సమస్యలతో ఉన్నవారిని కౌగిలించుకుని ఓదార్పునిస్తుంది. ఇదే విషయంపై హూటన్ స్పందిస్తూ.. తన పని ప్రజలు అనుకున్నంత సులభం కాదని అన్నారు. దీని కోసం .. ఎదుటివారి మనసుని అర్ధం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండాలన్నారు. తాను ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు.. వారి దుఃఖాన్ని పంచుకుంటూ.. ఓదార్పునివ్వాలని బాధితులు భావిస్తారని.. అందుకు అనుగుణంగా తాను స్పందించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే తాను చేస్తోన్న పనిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారని.. కానీ తాను అవేవీ పట్టించుకోనని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on