ఏరు దాటుతున్న ఏనుగుల గుంపుపై మొసలి దాడి.. సూపర్ షాకిచ్చిన ఏనుగు..
గజేంద్రమోక్షం గురించి అందరికీ తెలిసిందే. నీళ్లు తాగేందుకు వచ్చిన ఏనుగును మొసలి పట్టుకుంటుంది. దాని బారినుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఏనుగు మొసలి బలం ముందు నిలువలేకపోతుంది.
గజేంద్రమోక్షం గురించి అందరికీ తెలిసిందే. నీళ్లు తాగేందుకు వచ్చిన ఏనుగును మొసలి పట్టుకుంటుంది. దాని బారినుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఏనుగు మొసలి బలం ముందు నిలువలేకపోతుంది. ఈ క్రమంలో తనను రక్షించమంటూ ఆ శ్రీమహావిష్ణువును ప్రార్ధిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి గజరాజును రక్షిస్తాడు. అలాంటి సీన్ ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఏనుగును రక్షించేందుకు విష్ణుమూర్తి రాలేదు.. కానీ ఏం జరిగిందో మీరే చూడండి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఏనుగుల మంద ఓ ఏరును దాటుతోంది. ఈ క్రమంలో అందులో ఉన్న మొసలి ఆ ఏనుగుల మందలోని ఓ చిన్ని ఏనుగుపై దాడి చేసింది. నోటితో ఏనుగు తొండాన్ని పట్టుకుంది. మొసలి దాడిని గమనించిన మిగతా ఏనుగులు గబగబా ఒడ్డుకు వెళ్లిపోయాయి. అయితే తన బిడ్డపై మొసలి దాడి చేయడాన్ని గమనించిన తల్లి ఏనుగు వెంటనే నీటిలోకి దిగింది. మొసలి బారినుంచి తన పిల్లను కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఆతర్వాత ఆమొసలికి చుక్కలు చూపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాచిలర్ కష్టాలు.. కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు కానీ !!
కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!
ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??
చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా
కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

