నాకు ఉద్యోగం ఇవ్వండి.. నా ట్యాలెంట్‌ ఏంటో చూపిస్తా..

Updated on: Jul 29, 2025 | 9:05 PM

ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు రెజ్యూమ్‌ అనేది చాలా కీలకంగా ఉంటుంది. రెజ్యూమ్‌ ఎంత ఇంప్రెసివ్‌గా ఉంటే ఇంటర్వ్యూలో అంత విజయం సాధించడానికి ఆస్కారముంటుంది. అభ్యర్ధి క్వాలిఫికేషన్‌, అతని స్కిల్స్‌, ఎక్స్‌పీరియన్స్‌ అన్నీ చక్కగా క్లారిటీగా రెజ్యూమ్‌లో పొందుపరచాలి. కానీ ఓ యువకుడు ఉద్యోగానికి అప్లై చేస్తూ సగం రెజ్యూమ్‌నే పంపించాడు.

పైగా అందులో ఓ సవాలు విసురుతున్నట్టుగా ఓ వాక్యం రాసాడు. ఈ రెజ్యూమ్‌ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. రెడిట్‌లోని ‘రిక్రూటింగ్ హెల్’ అనే కమ్యూనిటీలో ఓ రెజ్యూమ్‌ ఫోటో పోస్ట్ చేశారు. అందులో అభ్యర్థి ఫోటో సగం, తన కెరీర్ లక్ష్యం మాత్రమే ఉన్నాయి. కాగితం మిగతా భాగం అంతా ఖాళీగా ఉండి, మధ్యలో స్పష్టంగా “నన్ను నియమించుకుంటే నా పూర్తి సామర్థ్యాన్ని చూడగలరు” (Hire me to unlock my full potential) అనే ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్ట్ నెటిజన్లలో చర్చకు దారితీసింది. కొందరు దీనిపై ఫన్నీకామెంట్లు చేశారు. మరికొందరు అభ్యర్థి క్రియేటివిటీని ప్రశంసించారు. “నేనే కనుక రిక్రూటర్ అయితే వెంటనే అతన్ని ఇంటర్వ్యూకి పిలుస్తానని ఇంకొకరు కామెంట్‌ చేశారు. ఇది నిజంగా ఉద్యోగం కోసం వేసిన ఒక ఎత్తుగడా.. లేక ప్రింటింగ్‌ ప్రోబ్లమ్‌ వల్ల జరిగిందా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఇది ఉద్యోగ అన్వేషణకి కొత్త మార్గం చూపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా కదులుతున్న రైల్లో రీల్స్‌ చేస్తున్న యువతి, ఇంతలో..

ఆర్డర్‌ పెట్టకుండానే వందలకొద్దీ పార్శిళ్లు..

అవి విష పురుగులు కాదు.. జెల్లీఫిష్‌లు..

తల్లి ప్రేమను చాటుకున్న గొరిల్లా..ఏం చేసిందో చూడండి

ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను.. రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?