Crabs in Metro: మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డ పీతలు.!
మెట్రో రైళ్లలో ప్రయాణికులు చాలావరకు మోత బరువులు లేకుండా, నీటుగా తయారై వెళ్తుంటారు. చెవుల్లో హెడ్‌ఫోన్లు, చేతుల్లో స్మార్ట్‌ఫోన్లతో ఎవరి లోకంలో వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఆకాశం నుంచి కాకపోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి కింద పడ్డాయి. స్వేచ్ఛ దొరికిందే తడవుగా తలోవైపు చకచకా పరుగులు తీశాయి.
మెట్రో రైళ్లలో ప్రయాణికులు చాలావరకు మోత బరువులు లేకుండా, నీటుగా తయారై వెళ్తుంటారు. చెవుల్లో హెడ్‌ఫోన్లు, చేతుల్లో స్మార్ట్‌ఫోన్లతో ఎవరి లోకంలో వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఆకాశం నుంచి కాకపోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి కింద పడ్డాయి. స్వేచ్ఛ దొరికిందే తడవుగా తలోవైపు చకచకా పరుగులు తీశాయి. దాంతో సదరు మహిళ గాభరాతో మెట్రో రైలు తలుపు వైపు పరుగెత్తింది. సాయం కోసం అటు ఇటూ చూసింది. చిరిగిన సంచినే వాటిపై గట్టిగా అదిమిపెడుతూ ఆపసోపాలు పడింది.
ఇదంతా చూస్తున్న సూటు బూటు వేసుకున్న ఓ పెద్దాయన ఆమెకు సాయంగా రంగంలోకి దిగాడు. ఎడమ చేత్తో ఫోను చూస్తూనే కుడి చేత్తో పీతల వేట మొదలు పెట్టాడు. ఆయనకు మరో ‘హెడ్‌ఫోన్’ ప్రయాణికుడు, మరో వ్యక్తి తోడయ్యారు. ఇంకొకరు పెద్ద ఖాళీ సంచి అందించారు. అంతా కలిసి ఒక్కో పీతను ఒడుపుగా ఒడిసిపట్టి సంచిలో వేశారు. అయినా పీతలు పట్టుకున్న వాళ్లను కొండీలతో కుడుతూ పారిపోయేందుకు ప్రయత్నించాయి.
చివరికి అంతా కలిసి అన్ని పీతలనూ విజయవంతంగా సంచీలో వేశారు. మెట్రోలో ఈ పీతల హడావిడిని ఒక ప్రయాణికుడు వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే ఏకంగా కోటీ 15 లక్షల మందికి పైగా చూశారు. లెక్కలేనన్నిసార్లు షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుప్పలు తెప్పలుగా లైక్‌లు, కామెంట్లూ వస్తున్నాయి. ‘సూటూ బూటు నీటుగాళ్లు తిరిగే మెట్రోలో సాయానికి ఇంతగా జనం ముందుకురావడం గ్రేట్’ అని ఒకరు, ‘పీతలు భలే తాజాగా ఉన్నాయి. వండుకు తింటే నా సామిరంగా..’ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

