Konaseema: యజమాని మృతి.. మృతదేహం ముందు ఆవు ఆక్రందన
సఖినేటిపల్లి మండలం మోరిలో హృదయాన్ని కదిలించే ఘటన ఒకటి వెలుగుచూసింది. యజమాని మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆవు.. అరగంట పాటూ మృతదేహం దగ్గరే అరుస్తూ తన వేదనను వ్యక్తపరిచింది. యజమాని కోసం ఆవు విలపించిన తీరు అందర్నీ కదిలించింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. మీరూ చూడండి....
మనిషి మాత్రమే కాదు… ప్రేమను చూపిస్తే.. ఇతర జీవులు సైతం అంతే ఎమెషనల్‌గా అటాచ్ అవుతాయి. పెట్ యానిమల్స్, ఆవులు, ఇతర జీవాలు సైతం తమను ప్రేమగా చూసుకునే యజమానుల పట్ల అంతే ఆప్యాయతను ప్రదర్శిస్తాయి. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆవు మూగ వేదన అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన పోతురాజు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఆ సమయంలో పొలం నుంచి వచ్చిన ఆవు.. యజమాని సత్యనారాయణమూర్తి మృత దేహం దగ్గరికి వచ్చి విలపించింది. అరగంట పాటూ యజమాని మృతదేహం దగ్గరే గట్టిగా అరుస్తూ తన బాధను వ్యక్తపరిచింది. దీంతో కుటుంబ సభ్యులను, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు.
నేటి సమాజంలో మనుషులకు.. రక్త సంబంధీకులపైనే ప్రేమ ఉండటం లేదు. ఆస్తి కోసం ఒకర్ని.. ఒకరు చంపుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఓ మూగ జీవి యజమానిపై చూపిన ప్రేమను స్థానికులు కొనియాడుతున్నారు. ఆ ఆవును.. చిన్నప్పటి నుంచి సత్యనారాయణ మూర్తి కన్న బిడ్డ వలె సాకాడని.. అందుకే అది అంతగా వేదనకు గురైందని స్థానికులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..