ఇది తల్లి ప్రేమ మాత్రమే కాదు.. అంతకు మించి!

Updated on: Nov 14, 2025 | 10:49 AM

అనాధైన గొర్రెపిల్లకు పాలిచ్చి సాకుతున్న ఓ గోమాత కథ ఇది. తల్లిని కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న గొర్రెపిల్లకు ములుగు జిల్లా వాజేడులో ఒక రైతు ఇంట్లో ఆవు అమ్మగా మారింది. మానవులు మానవత్వాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో పశుపక్ష్యాదులు దానిని గుర్తుచేస్తున్నాయనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆపదలో ఉన్నవారికి మానవత్వంతో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడటం మానవ సహజం. అది ప్రస్తుతకాలంలో కరువైపోతుందనేందుకు ఉదాహరణగా అనేక ఘటనలు నెట్టింట మనం చూశాం. కొందరు కన్నబిడ్డలు వృద్ధులైన తల్లిదండ్రులను అనాధలుగా వదిలేస్తున్నారు. మరికొందరు కన్నబిడ్డలను కళ్లు తెరవకముందే కడతేర్చుతున్నారు. మనుషులంతా ఇలా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటే..పశుపక్ష్యాదులు దానిని గుర్తుచేస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తల్లిని కోల్పోయి అనాధగా మారి, ఆకలితో అలమటిస్తున్న గొర్రపిల్లకు తనబిడ్డతో సమానంగా పాలిచ్చి సాకుతోంది ఓ గోమాత. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. స్థానికంగా ఉండే సమ్మయ్య అనే రైతు ఇంట్లో ఓ గొర్రె రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఏ కారణం చేతనో ఆ గొర్రె చనిపోయింది. గొర్రెపిల్లలు తల్లిపాలకు దూరమై ఆకలితో అలమటిస్తుంటే.. రైతు పెంచుకుంటున్న ఆవు ఆ గొర్రెపిల్లకు అమ్మగా మారింది. గొర్రెపిల్లకు ఆకలి వేయడంతో గోవు పొదుగు కనిపించగానే అమాయకంగా పరుగెత్తుకెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. దాని ఆకలిని గుర్తించిన ఆవు గొర్రెపిల్లను ఏమీ అనకుండా కుడుపారా పాలిచ్చింది. ఈ ఘటన చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. విషయం చుట్టుపక్కలవారందిరికీ తెలియడంతో రైతు ఇంటికి క్యూ కట్టారు. ఆవు గొర్రెపిల్లకు పాలివ్వడం చూసి.. ఇది కదా అమ్మతత్వం అంటే…ఇది మానవత్వం కాదు.. గోవు తత్వం అంటూ చర్చించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరణ్‌ను తెగ పొగిడేసిన వర్మ.. బుచ్చిబాబుపైనా..

మీకు నచ్చినోళ్లనే సెలెక్ట్ చేస్తారా ?? టీమిండియా టెస్ట్ టీం ఎంపికపై విమర్శలు

పెళ్లయిన 6 నెలలకే.. వేధింపులు తట్టుకోలేక!

Nallamala: అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వజ్రాల వేట

ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా

Loading...
Unable to load recommendations.
Follow Us