ఆవులకు అందాల పోటీలు.. చూడడానికి రెండు కళ్లు చాలావు!
అంబేద్కర్ కోనసీమ జిల్లా కేశనపల్లిలో రాష్ట్రస్థాయి ఆవులు, ఎద్దుల అందాల పోటీలు అలరించాయి. ఈ పోటీల్లో ఒంగోలు, పుంగనూరు, గిరి ఆవులు పాల్గొన్నాయి.రాష్ట్ర పశుసంవర్థకశాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో అడబాల లక్ష్మీనారాయణ నిర్వహించిన ఈ పోటీల్లో 180 వివిధ రకాలకు
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు తిరుపతి తదితర జిల్లాలకు చెందిన అనేకమంది రైతులు, తమ ఆవులను, గిత్తలను పోటీలకు తీసుకొచ్చారు. అనంతరం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు విజేతలకు బహుమతులు అందించారు. పాడి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.