అమ్మాయిలూ.. మీకో బంపరాఫర్‌.. 25 ఏళ్ల లోపు పెళ్లిచేసుకునే అమ్మాయిలకు నగదు బహుమతి

|

Sep 01, 2023 | 10:24 AM

చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోతుండటంతో జనాభా పెంచుకునే పనిలో వివిధ పద్ధతులను చేపడుతున్నాయి అక్కడి ప్రభుత్వ యంత్రాంగం. ఈ క్రమంలో 25 ఏళ్ల లోపు వయసులో పెళ్లిచేసుకునే యువతులకు రివార్డులు ప్రకటించింది. అవును, బీజింగ్‌ రాష్ట్రంలోని చాంగ్షాన్‌ కౌంటీ ఓ ఆసక్తికర ప్రకటనచేసింది. రాష్ట్రంలోని పెళ్లిచేసుకునే జంటలో యువతికి 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉంటే ఆమకు 1000 యువాన్ల నగదు బహుమతి అంటే ఇండియన్‌ కరెన్సీలో 11 వేలకుపైనే ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోతుండటంతో జనాభా పెంచుకునే పనిలో వివిధ పద్ధతులను చేపడుతున్నాయి అక్కడి ప్రభుత్వ యంత్రాంగం. ఈ క్రమంలో 25 ఏళ్ల లోపు వయసులో పెళ్లిచేసుకునే యువతులకు రివార్డులు ప్రకటించింది. అవును, బీజింగ్‌ రాష్ట్రంలోని చాంగ్షాన్‌ కౌంటీ ఓ ఆసక్తికర ప్రకటనచేసింది. రాష్ట్రంలోని పెళ్లిచేసుకునే జంటలో యువతికి 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉంటే ఆమకు 1000 యువాన్ల నగదు బహుమతి అంటే ఇండియన్‌ కరెన్సీలో 11 వేలకుపైనే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 140 కోట్లకు పైగా జనాభా కలిగిన చైనాలో ప్రస్తుతం జననాల రేటు తగ్గిపోతుండటంతో ఆందోళన చెందుతోంది ఆదేశం. ఈ క్రమంలోనే యువతులు తగిన వయసులో వివాహం చేసుకునేందుకు, పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చాంగ్షాన్‌ నగదు ప్రోత్సాహకాన్ని తీసుకువచ్చింది. వివాహం తర్వాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలోనూ సబ్సీడీలు ఇచ్చి జంటలకు ఆర్థికంగా సహకరించనుంది. చైనాలో స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు 20 నుంచి 22 సంవత్సరాలు. జీవన వ్యయాలు పెరిగి, ప్రజలు చిన్న కుటుంబాలకు అలవాటు పడటంతో పెళ్లి చేసుకునే జంటల సంఖ్య తగ్గిపోతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిట్టీల పేరుతో రూ. 7కోట్ల టోకరా !! ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు

TOP 9 ET News: మొదలైన సలార్ ట్రైలర్ కౌంట్‌డౌన్ | ఇప్పుడప్పుడే కాదు.. ఇంకా టైం ఉంది

Tiger Nageswara Rao: టైగర్ నాగశ్వరరావుకు ఝలక్‌.. హైకోర్ట్ సీరియస్

Pawan Kalyan: వావ్ !! 470కిలోల వెండితో పవన్ బొమ్మ

Salaar: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ !!

 

Follow us on