Viral Video: సముద్రంలో సరదాగా ఆటలాడుతున్న జంట.. ఒక్కసారిగా షాక్! ఏం జరిగిందంటే..

|

Apr 16, 2021 | 8:50 PM

జలకాలాటలలో.. కిలకిలా పాటల్లో అనుకుంటూ.. సముద్రంలో ఆటలాడుకోవడం కొంతమందికి భలే సరదా. రకరకాలుగా సముద్రంలో ఆడుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. అందులో స్నార్కెలింగ్ ఒకటి.

Viral Video: సముద్రంలో సరదాగా ఆటలాడుతున్న జంట.. ఒక్కసారిగా షాక్! ఏం జరిగిందంటే..
Viral Video
Follow us on

Viral Video: జలకాలాటలలో.. కిలకిలా పాటల్లో అనుకుంటూ.. సముద్రంలో ఆటలాడుకోవడం కొంతమందికి భలే సరదా. రకరకాలుగా సముద్రంలో ఆడుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. అందులో స్నార్కెలింగ్ ఒకటి. సముద్రం లోతుల్లో ఈత కొడుతూ ఆడే ఆట ఇది. ఈ ఆట ఆడటానికి సరదాగానే ఉంటుంది. కానీ, ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు తలెత్తుతాయి. అటువంటప్పుడు గుండె ఆగినంత పని అవుతుంది. అదృష్టం బావుంటే ఫర్వాలేదు.. లేకపోతే అంతేసంగతులు అనిపించేలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతాయి. అటువంటిదే ఈ వీడియో. జపాన్ లోని ఒకినావా ద్వీపం సమీపంలో తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పాట్రిక్ డేవిస్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి స్నార్కెలింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక హంప్‌బ్యాక్ తిమింగలం అకస్మాత్తుగా వారి పైకి దూకినంత పనిచేసింది. చూస్తుంటేనే ఒళ్ళు జలదరిస్తున్న ఈ వీడియో పాట్రిక్ డేవిస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నలభై సెకన్లు ఉన్న ఈ వీడియోలో తిమింగలం వారి మీద పడగానే తప్పించుకుని తమ పడవ వైపు ఈతకొడుతున్న ఈ జంట కనిపిస్తోంది. వారికి కొంచెం దూరంలోనే తిమింగలం కూడా కనిపిస్తోంది.

తిమింగలాలు సంబంధించి ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల ఒక డ్రోన్ కెమెరాలో చిత్రీకరించిన ఇటువంటి వీడియో ఒకటి మరింత ప్రత్యేకంగా ఉంది. ఆ వీడియోలో తిమింగలం తన ఆహారాన్ని సంపాదించుకోడానికి ఏమి చేస్తుందో స్పష్టంగా కనిపించింది. తన నోటిని పూర్తిగా చాపి చిన్న చేపలు ఈదుతున్న డైరెక్షన్ కి వ్యతిరేక దిశలో ఆగుతుంది తిమింగలం. చేపలు కుప్పలుగా నేరుగా వచ్చి ఆ నోటిలోకి దూరిపోతాయి. అసలు ఏమాత్రం కష్టం లేకుండా తన భోజనం ముగించేసి చక్కా వెళ్ళిపోతుంది తిమింగలం. ఈ వీడియో బీబీసీ ఏ పెర్ఫెక్ట్ ప్లానేట్ నుంచి వచ్చింది. దీన్ని దాదాపు 8 లక్షాలకు పైగా చూశారు.

సముద్రంలో జరిగే వింతలు.. ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్ని వీడియోలు ఇటువంటివి చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.

Also Read: Corona Cases: సెప్టెంబర్ నాటి రికార్డు ఏప్రిల్ బద్దలు..? కరోనా సెకెండ్ వేవ్ ఉధృతే ఉధృతి

Corona Tension: మహారాష్ట్ర కఠిన ఆంక్షలు..స్వస్థలాలకు వెళ్ళడానికి భారీగా రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్న ప్రజలు!