బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం

Updated on: Jul 14, 2025 | 6:57 PM

ఎవరైనా అగ్ని సాక్షిగా పెళ్లాడతారు. కానీ, వీరేంటో ఏకంగా అగ్నిపర్వతం సాక్షిగా ఉంగరాలు మార్చుకుని.. అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలకు ఫోజులిచ్చి.. మరపురాని మధుర జ్ఞాపకంగా తమ మ్యారేజ్‌ ప్రపోజల్‌ను మలుచుకున్నారు. ఈ అరుదైన ఘటన అమెరికాకు సమీపంలో హవాయి ఐలాండ్స్‌లో జరిగింది. ఎక్కడైనా అగ్నిపర్వతం పేలితే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్తారు.

అయితే, ఆ జంట మాత్రం అలా చేయలేదు. పొగలుగక్కుతున్న అగ్నిపర్వతం బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంగేజ్‌మెంట్‌ని ఘనంగా జరుపుకున్నారు. నిప్పులు చెరగుతున్న కిలావు అగ్నిపర్వతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ నిశ్చితార్థం జరగడం గమనార్హం. హవాయి ద్వీపాల సమూహంలో కిలావు అగ్నిపర్వతం అత్యంత చురుగ్గా ఉంటుంది. ఇది పేలిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిపర్వతానికి 60 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాషింగ్టన్ డీసీకి చెందిన మార్క్‌ స్టీవర్ట్‌ అనే యువకుడు మాత్రం ఈ అగ్నిపర్వతం ముందే తను గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. విల్‌ యు మ్యారీ మీ అంటూ మోకాలి మీద వంగి పువ్వు ఇచ్చి అడిగాడు. అందుకు ఒలివియా ఎంతో సంతోషంగా ఎస్‌ అనడంతో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో లావా విరజిమ్ముతున్న అగ్నిపర్వతం సాక్షిగా జరిగిన తంతుకు సంబంధించి అద్భుత ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు మార్క్‌. ఫొటోలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నెటిజన్ల నుంచి మార్క్‌ ఒలివియాకు అభినందనలు వెల్లువెత్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ

బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు

స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం

పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!

170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు