బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే

Updated on: Dec 29, 2025 | 1:13 PM

కార్పొరేట్ రంగంలో నోటి మాటతో ఇచ్చే హామీలు నమ్మవద్దని ఒక సంఘటన వైరల్ అవుతోంది. బాస్ మౌఖిక హామీని నమ్మి, ₹26 లక్షల వార్షిక వేతన ఆఫర్‌ను వదులుకున్న ఉద్యోగి చివరికి తీవ్రంగా నష్టపోయాడు. బాస్ మాట మార్చడంతో, రాతపూర్వక ఒప్పందాల ప్రాముఖ్యత స్పష్టమైంది. విశ్వాసం కంటే రాతపూర్వక హామీలే మనకు రక్షణ అని ఈ ఘటన చాటిచెబుతోంది.

కార్పొరేట్ రంగంలో నోటి మాటతో ఇచ్చే హామీలకు విలువ ఉండదని చాటిచెప్పే ఓ ఘటన వైరల్‌ అవుతోంది. తన బాస్ ఇచ్చిన మాటను నమ్మి, ఏకంగా రూ.26 లక్షల ఆన్యువల్‌ సాలరీ ఆఫర్‌ను వదులుకున్న ఓ ఉద్యోగి చివరికి తీవ్రంగా నష్టపోయాడు. ఈ బాధాకర అనుభవాన్ని ‘ఔట్‌కమ్ స్కూల్’ వ్యవస్థాపకుడు అమిత్ శేఖర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అస‌లేం జ‌రిగిందంటే..! అమిత్ శేఖర్ విద్యార్థి ఒకరు తన సొంత ఊరికి సమీపంలోని కంపెనీలో రూ.15 లక్షల వార్షిక వేతనంతో పనిచేస్తున్నాడు. ఇటీవలే అతనికి మరో ప్రముఖ కంపెనీ నుంచి రూ.26 లక్షల ప్యాకేజీతో ఉద్యోగావకాశం వచ్చింది. దీంతో అతను పాత కంపెనీకి రాజీనామా చేశాడు. ఇది గమనించిన అతని బాస్, జీతం పెంచుతానని, కంపెనీ మారవద్దని మౌఖిక హామీ ఇచ్చాడు. బాస్ మాటను గుడ్డిగా నమ్మిన ఆ ఉద్యోగి, కొత్త ఆఫర్‌ను తిరస్కరించాడు. కొత్త కంపెనీలో చేరాల్సిన తేదీ ముగిసిన నెల రోజుల తర్వాత బాస్‌తో సమావేశమయ్యాడు. ఆ సమావేశంలో బాస్ మాట మార్చేశాడు. “జీతం ఏమీ పెంచడం లేదు. నీ ప్యాకేజీ రూ.15 లక్షలే ఉంటుంది” అని తేల్చి చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగి షాకయ్యాడు. రాతపూర్వకంగా హామీ లేకుండా నమ్మవద్దని తాను ముందే సలహా ఇచ్చానని, కానీ సొంత ఊరికి దగ్గరగా ఉండాలనే కారణంతో అతను ఆ నిర్ణయం తీసుకున్నాడని అమిత్ శేఖర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. “విశ్వాసం ముఖ్యమే అయినా, రాతపూర్వక ఒప్పందాలే మనకు రక్షణ” అని స్పష్టం చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ, ఇది బాధాకర విష‌య‌మ‌ని, కౌంటర్ ఆఫర్లను ఎప్పుడూ రాతపూర్వకంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్‌

2025లో గూగుల్‌లో ఎక్కువ ఎవరికోసం సెర్చ్‌ చేసారో తెలుసా ??

మీ సెల్‌ఫోన్ పోయిందా ?? ఇలా చేయండి.! రికవరీ చాలా ఈజీ