19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
ఒక ఉద్యోగి తన బాస్ నోటి మాట నమ్మి, రూ. 26 లక్షల వార్షిక ప్యాకేజీని వదులుకుని తీవ్రంగా నష్టపోయాడు. కార్పొరేట్ రంగంలో రాతపూర్వక హామీలే రక్షణ అని ‘ఔట్‌కమ్ స్కూల్’ వ్యవస్థాపకుడు అమిత్ శేఖర్ ఈ ఘటన ద్వారా వివరించారు. నోటి మాటతో ఇచ్చే హామీలకు విలువ ఉండదని, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటన హెచ్చరిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని కర్జి వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇప్పుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువకులను బోల్తా కొట్టించి.. అందినకాడికి దోచుకోవటమే పనిగా వాణి పెట్టుకుంది. పెళ్లి కానీ ప్రసాదులను ఎంచుకొని వారి నుంచి ఎదురు కట్నం తీసుకొని పెళ్లికి రెడీ కావటం, సరిగ్గా పెళ్లైన వారం రోజులకే అందిన కాడికి వరుడి కుటుంబం నుంచి అందినకాడికి దోచుకుని పరారైపోవటం ఈమె స్టయిల్. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లాడిన ఈ లేడీ కిలాడీ.. అతడికీ హ్యాండ్ ఇచ్చింది. వివాహం అనంతరం వరుడు, అతని కుటుంబంతో కలిసి కర్ణాటకలోని అత్తగారింటికి వాణి బయలుదేరింది. వారంతా పలాసలో రైలు ఎక్కి కూర్చొన్నారు. కాగా, రైలు విజయనగరం రాగానే, వరుడు తరుపు వారిచ్చిన రూ. లక్ష నగదు, ఖరీదైన బట్టలు, ఇతర ఖర్చుల నిమిత్తం వారు ఇచ్చిన డబ్బులు తీసుకుని.రెండో కంటికి తెలియకుండా రైలు దిగి పారిపోయింది. రైలు బయలుదేరినా.. బాత్ రూం నుంచి భార్య రాకపోవటంతో ఆందోళన చెందిన వరుడు రైలంతా వెతికినా ఆమె కనిపించకలేదు.చివరికి వాణి.. ఇచ్చాపురం లోని మేనత్త ఇంటికి చేరుకున్నట్టు తెలిసింది. అక్కడికి వెళ్లి వాణి మేనత్తను నిలదీసే సరికి.. అసలు వాణి బండారం అంతా బయటపడింది. నేరుగా తమ ఇంటికే వచ్చి వరుడి కుటుంబం అంతా నిలదీయటంతో.. షాకైన వాణి, ఆమె మేనత్త సంధ్య కాళ్లబేరానికి వచ్చారు. తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తామని మభ్యపెట్టారు. కట్‌చేస్తే చెప్పాపెట్టకుండా అత్తాకోడలు.. కామ్‌గా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. దీంతో గురువారం వాణి వల్ల మోసపోయిన బాధితులు నాగిరెడ్డి, కేశవ రెడ్డి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వాణి వలన గతంలో మోసపోయిన వారి వివరాలూ తెలుసుకున్న వరుడు, అతని కుటుంబ సభ్యులు గతంలో వాణి మోసం చేసిన 8 మంది పెళ్లి కొడుకుల వివరాలు, ఆయా పెళ్లిళ్ల సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. అయితే బాధితుల ఫిర్యాదుపై ఇచ్చాపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాణి తల్లి చిన్నప్పుడే మృతి చెందటం తండ్రి పెద్దగా ఆమెను పట్టించుకోకపోవడంతో మేనత్త సంధ్య ఆమెను చేరదీసింది. సంధ్య గతంలో మైనర్ కావడంతో పెళ్లి పేరిట ఆమె మేనత్త పలువురిని మోసగించినా.. ఎవరూ నోరెత్తలేదు. అయితే ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్ళు కావడంతో ఆమె పెళ్ళిళ్ళ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..
తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర