Corona New Rule: కరోనా కొత్త రూల్‌.. ముద్దులు, కౌగిలింతలు.. భోజనం కూడా.. అసలు మేటర్ తెలిస్తే షాకే..

Updated on: Apr 17, 2022 | 9:27 AM

ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను అమలు చేస్తోంది చైనా. ఇంట్లో జంటలు వేర్వేరుగా నిద్రపోవాలని, ముద్దులు, కౌగలింతలు వంటివి వద్దని, భోజనం కూడా విడిగానే చేయాలని అధికారులు ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది.


ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను అమలు చేస్తోంది చైనా. ఇంట్లో జంటలు వేర్వేరుగా నిద్రపోవాలని, ముద్దులు, కౌగలింతలు వంటివి వద్దని, భోజనం కూడా విడిగానే చేయాలని అధికారులు ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. దీంతో అధికారులపై మండిపడుతున్నారు అక్కడి ప్రజలు. అయితే, ఈ నిబంధన కూడా కరోనా కట్టడికే అని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు తగ్గాలని కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్‌ విధించారు చైనా అధికారులు. కానీ, ఈ అర్థం లేని రూల్స్‌తో వైరస్‌ సోకిన దానికంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు షాంఘై ప్రజలు. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మార్చి చివరి వారంలో ప్రకటించింది చైనా. రెండు దశల్లో తొమ్మిది రోజులపాటు ఈ లాక్‌డౌన్ ఉంటుందని, ఆ సమయంలో అధికారులు భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని చైనా తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో ఇక్కడ లాక్‌డౌన్ విధించలేదంటున్నారు స్థానిక ప్రజలు.ప్రభుత్వం డ్రోన్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్‌ నిబంధనలు పాటించండి. స్వేచ్ఛ కోసం మీ మనస్సులో నిండిన కోరికను నియంత్రించుకోండి. కిటికీలు తెరవకండి.. పాడకండి అంటూ ఓ నెటిజన్‌ డ్రోన్‌ ప్రకటన వీడియోను షేర్‌ చేశారు. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కిరాణా సామాన్ల కోసం కూడా బయటకు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో, బుధవారం నాడు సుమారు 20 వేల కేసులు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో ఇది కొత్త రికార్డుగా చెబుతున్నారు. దాంతో ఏప్రిల్‌ 4న షాంఘైలో లాక్‌డౌన్‌ను నిరవధికంగా పొడిగించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Published on: Apr 17, 2022 09:27 AM