Akhilesh Yadav: వివాదంలో యోగి ప్రభుత్వం.! కాశీలో ధోతీ-కుర్తాయే పోలీసుల యూనిఫామ్‌..

|

Apr 15, 2024 | 8:10 AM

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. ఇక నుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వహిస్తారని తెలిపింది. దీనిపై వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆలయం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ-కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో అర్చకుల వస్త్రధారణలో కనిపించారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. ఇక నుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వహిస్తారని తెలిపింది. దీనిపై వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆలయం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ-కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో అర్చకుల వస్త్రధారణలో కనిపించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకుల మాదిరిగా డ్రెస్‌ కోడ్‌ ధరించాలని ఏ పోలీసు మ్యానువల్‌లో ఉందని ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులు ఇచ్చిన వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ రేపు ఎవరైనా దీన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడితే.. ప్రజలను దోపిడీ చేస్తే.. యూపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. అటు సోషల్‌ మీడియాలోనూ యోగి సర్కారుపై విమర్శలు వస్తున్నాయి.

ఈ నిర్ణయాన్ని కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ మాత్రం సమర్థించారు. ఆలయాల్లో విధి నిర్వహణ మిగతా ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రద్దీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించదు. అయితే భక్తులకు త్వరగా దర్శనం కల్పించే క్రమంలో కొన్ని సార్లు పోలీసులు వ్యవహరించే తీరు ప్రజలకు బాధ కలిగించొచ్చు. అదే వారు అర్చకుల మాదిరిగా కనిపిస్తే భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ డ్రెస్‌కోడ్‌ను మార్చాం అని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..