Continuing Pregnancy: అది ఆమె ఇష్టం.! గర్భం విషయంలో హైకోర్టు స్పష్టం.!

|

Jul 30, 2024 | 3:59 PM

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది బాధిత మహిళ ఇష్టమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 32 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఒకరు కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలిక తన గర్భాన్ని కొనసాగించి పుట్టే బిడ్డను దత్తతకు ఇవ్వావాలనుకుంటే అలాగే చేయొచ్చని,

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది బాధిత మహిళ ఇష్టమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 32 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఒకరు కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలిక తన గర్భాన్ని కొనసాగించి పుట్టే బిడ్డను దత్తతకు ఇవ్వావాలనుకుంటే అలాగే చేయొచ్చని, అయితే ఈ విషయాన్ని వీలైనంత ప్రైవేటుగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గర్భ విచ్ఛిత్తి వల్ల ప్రమాదం పొంచి వుందన్న వైద్యుల కౌన్సెలింగ్ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన గర్భాన్ని తొలగించుకోవాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని ఆమె తప్ప మరెవరూ తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడిందని జస్టిస్ శేఖర్ బీ సరఫ్, జస్టిస్ మంజీవ్ శుక్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on