నిద్రపోదామని రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి.. దిండుకింద ఏదో కదలిక.. చూస్తే

Updated on: Jun 07, 2025 | 12:31 PM

ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఆ కుటుంబ సభ్యులంతా ఇక నిద్రపోవడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మంచంపై కూర్చున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న దిండుకింద ఏదో కదులుతున్నట్టు గుర్తించాడు. ఏమై ఉంటుందా అని చూసిన అతనికి ఒళ్లు జలదరించింది. భయంతో అక్కడినుంచి బయటకు పరుగుతీశాడు.

అనంతరం కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. అందరూ అక్కడికి వచ్చి దిండుకింద ఉన్న నాగుపామును చూసి షాకయ్యారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా అది దిండుకిందనుంచి మంచం కిందకు వెళ్లి దాక్కుంది. అది గమనించిన స్నేక్‌ క్యాచర్‌ ఆపామును జాగ్రత్తగా పట్టుకొని ప్లాస్టిక్‌ డబ్బాలో బంధించి తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలినట్టు తెలిసింది. దిండుకింద నక్కిన పాము వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది ఈ వీడియోను చూసిన వేలాదిమంది తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఓరినాయనో.. మరీ బెడ్ రూంలోకి వచ్చేస్తే మేం ఎలా బతకాలి మావ అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వర్షాకాలంలో పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపలు నడవడం చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే

కొబ్బరి నీళ్లతో జుట్టు సమస్యలకు చెక్‌!

గేటు దాటుతుండగా ట్రాక్‌పై ఇరుక్కుపోయిన ఈ-రిక్షా.. ఇంతలో