Snake Hulchal: నాగుపాము తలపై ముద్దుపెట్టిన స్నేక్‌ క్యాచర్‌.. ఊహించని షాకిచ్చిన స్నేక్‌..!

|

Oct 07, 2022 | 9:32 AM

కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. దాంతో స్థానికులు స్నేక్ క్యాచర్ అలెక్స్‌కు సమాచారం అందించారు. అతడు నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు.

Karnataka: Cobra bites snake catcher's lips in viral video @TV9 Telugu Digital
సాధారణంగా పాములంటే ఎంతటివారికైనా భయమే. పాము పేరు చెబితేనే ఆమడదూరం పారిపోయేవారు చాలామంది ఉంటారు. అలాగే పాములను చాకచక్యంగా పట్టుకొని అలాంటి వారిని కాపాడేవారు కొందరుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. దాంతో స్థానికులు స్నేక్ క్యాచర్ అలెక్స్‌కు సమాచారం అందించారు. అతడు నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. పాము తన చేతికి చిక్కగానే గుడ్‌ స్నేక్‌ అంటూ.. దాని తలపై ఓ ముద్దు పెట్టాడు. అంతే! ఒక్కసారిగా విషసర్పం నన్ను పట్టుకున్నదే కాకుండా ముద్దు కూడా పెడతావా.. అంటూ అతనిపై ఎటాక్‌ చేసింది. అతడి పెదవిపై కాటు వేసింది. దెబ్బకి ఆ పామును తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి.. ఆ తర్వాత చికిత్సకోసం ఆస్పత్రికి పరుగెత్తాడు. కాగా, ప్రస్తుతం అలెక్స్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎంత స్నేక్‌ క్యాచర్‌ అయినా పాములతో పరాచకాలు ప్రమాదం అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 07, 2022 09:32 AM