Viral Video: ఇలాంటి బరాత్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఎంతమంది ఉన్నారో చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో

|

Mar 14, 2022 | 7:21 PM

ఈ వీడియోను మార్చి 13న @PrasantIRAS అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 వేలకు పైగా వీక్షణలు, ఐదు వందల లైక్‌లు వచ్చాయి.

Viral Video: ఇలాంటి బరాత్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఎంతమంది ఉన్నారో చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో
Baraat Viral Video
Follow us on

భారతీయ వివాహాల్లో బరాత్‌(Baraat)లకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఇందులో బంధువులు, స్నేహితులు చిందులు వేస్తూ వధూవరులను ఊరేగిస్తుండడం ఎన్నో చూశాం. కొన్నిచోట్ల పెళ్లికి వెళ్లేముందు కూడా బరాత్‌లు చేస్తుంటారు. పెళ్లికొడుకు లేదా పెళ్లి కూతురుని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకెళ్తుంటారు. ఇలాంటి వీడియోలు ఎన్నో నెట్టింట్లో తెగ వైరల్(Viral) అయ్యాయి. తాజాగా ఈ లిస్టులోకి మరో వీడియో వచ్చి చేరింది. ఈ వీడియో(Funny Video) చూస్తే మాత్రం మీరు నవ్వకుండా ఉండలేదు. ఇలాంటి బరాత్‌ను మీరు ఇంతవరకు చూసి ఉండరు. అసలు ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడానికి ఓ వరుడు ఊరేగింపుగా బయలుదేరాడు. అయితే ఇందులో విశేషం ఏముందని అడుగుతున్నారా? అక్కడికే వస్తున్నాం. ఈ వీడియోలోని వరుడు బరాత్‌తో వేదిక వద్దకు బయలుదేరాడు. అయితే, కేవలం పెళ్లి కుమారిడితోపాటు నలుగురు వ్యక్తులే ఉండడంతో నెట్టింట్లో ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇద్దరు వ్యక్తులు డ్రమ్ములు వాయిస్తూ రోడ్డుపై వెళ్తున్నారు. వరుడి వేషంలో ఒక వ్యక్తి గుర్రంపై కూర్చున్నాడు. పెళ్లికొడుకుతో సహా కేవలం నలుగురు మాత్రమే ఈ ఊరేగింపులో పాల్గొనడంతో నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను చూసిన యూజర్లు.. ఇది కోరానా కాలం నాటి ఊరేగింపు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తే.. ఎవరూ లేకుండా డ్రమ్ వాయిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలని కొందరు కామెంట్లు చేశారు. కనీసం తల్లిదండ్రులు, బంధువులు కూడా ఈ ఊరేగింపులో లేకపోవడం చాలా దారుణం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను మార్చి 13న @PrasantIRAS అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 వేలకు పైగా వీక్షణలు, ఐదు వందల లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఈ వీడియోను చూసి నవ్వుకోండి మరి.

Also Read: Fact Check: సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలను గుడ్డిగా నమ్ముతున్నారా.? అయితే మీరు నెట్టింట్లో కాలు వేసినట్లే.

Viral Video: ఇంత క్యూట్ కచ్చ బాదం డ్యాన్స్‌ను మీరెప్పుడు చూసి ఉండరు.. వైరల్‌ అవుతోన్న వీడియో..