Havana Syndrome: హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా..?? వీడియో

|

Sep 24, 2021 | 10:06 AM

అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్‌కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించారు.

YouTube video player

అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్‌కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించారు. దీంతో హవానా సిండ్రోమ్ పట్ల అమెరికా అధికారులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. సీఐఏ డైరెక్టర్‌కు హవానా సిండ్రోమ్ లక్షణాలపై అమెరికా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బాధితుడి వివరాలను అమెరికా ఇంకా వెల్లడించలేదు. అయితే అతనికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అమెరికా దౌత్యవేత్తలు, ఇంటెలిజన్స్ అధికారులు మాత్రమే హవానా సిండ్రోమ్ బారినపడుతుండడం తెలిసిందే.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గుర్రంపై ఎక్కిన మేకలు స్వారీ.. సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

Viral Video: అక్కడన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన అమ్మాయిని ఎత్తుకు పోయి పెళ్లి చేసుకొటమే.. వీడియో

Published on: Sep 24, 2021 09:47 AM