Bengaluru: ఆమెను 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

బెంగళూరులో దారుణం జరిగింది. 1BHKలో ఒంటరిగా నివసిస్తున్న యువతిని హత్య చేసిన నిందితుడు 30 ముక్కలుగా కోసి శరీరభాగాలను ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టాడు. సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరన్న భవన్‌లో జరిగిందీ ఘటన. మృతురాలిని 26 ఏళ్ల మహాలక్షిగా గుర్తించారు.

Bengaluru: ఆమెను 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

|

Updated on: Sep 27, 2024 | 7:32 PM

బెంగళూరులో దారుణం జరిగింది. 1BHKలో ఒంటరిగా నివసిస్తున్న యువతిని హత్య చేసిన నిందితుడు 30 ముక్కలుగా కోసి శరీరభాగాలను ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టాడు. సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరన్న భవన్‌లో జరిగిందీ ఘటన. మృతురాలిని 26 ఏళ్ల మహాలక్షిగా గుర్తించారు. ఆమెది పశ్చిమ బెంగాల్ కానీ, చత్తీస్‌గఢ్ కానీ అయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. గత రెండ్రోజులుగా బాధితురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు ఆమె బంధువులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నిన్న ఆమె తల్లి, సోదరి ఇంటికి వచ్చి చూసి దిగ్భ్రాంతికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫిడ్జ్‌లో కుక్కిన శరీరభాగాలను చూసి షాకయ్యారు. రిఫ్రిజిరేటర్ పనిచేస్తున్నప్పటికీ శరీర భాగాలు కుళ్లిపోయి వాసన వస్తున్నట్టు గుర్తించారు. ఈ నెల మొదట్లోనే మహాలక్ష్మిని హత్య చేసి పదునైన ఆయుధంతో ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో కుక్కినట్టు అనుమానిస్తున్నారు.

ఓ ప్రముఖ మాల్‌లో పనిచేస్తున్న మహాలక్ష్మి రోజూ ఉదయం వెళ్లి రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఆమె ఐదారు నెలలుగా నివసిస్తోంది. ఆమె ఒంటరిగానే ఉంటోందని, ఎవరితోనూ పెద్దగా కలవదని, ఇటీవల కొన్ని రోజులుగా ఆమె సోదరుడు కూడా కనిపించాడని ఇరుగుపొరుగువారు తెలిపారు. ఆమె వివాహిత అని, ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. భర్తను రాణాగా గుర్తించి అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘాతుకానికి ఒక్క వ్యక్తే పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!