అయ్యో.. బురదలో ఇరుకున్న ఏనుగు.. కట్ చేస్తే..

Updated on: Dec 03, 2025 | 5:37 PM

చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న గాయపడ్డ ఏనుగును అటవీ అధికారులు 15 గంటలపాటు శ్రమించి రక్షించారు. కుడికాలు దెబ్బతిన్న ఒంటరి ఏనుగు చెరువులో కూరుకుపోగా, గ్రామస్తుల సమాచారంతో అటవీ, పోలీసు సిబ్బంది, కుంకీ ఏనుగులు, క్రేన్ల సాయంతో రెస్క్యూ చేశారు. తిరుపతి జూ వైద్యులు మత్తు ఇచ్చి, కట్టు కట్టి, ఏనుగును సురక్షితంగా బయటకు తీసి, తిరుపతి జూ పార్క్‌కు తరలించారు.

చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు బురదలో చిక్కుకొని నరకయాతన అనుభవించింది. తమిళనాడు నుంచి యాదమరి మండలం కమ్మపల్లి అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చిన ఒంటరి ఏనుగు దాహం తీర్చుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే కుడికాలు దెబ్బతిన్న ఏనుగు చెరువులోకి దిగింది. చెరువులో నుంచి బయటకు రాలేక బురదలో కురుకుపోయింది. బయటకు రాలేక కాలి నొప్పితో విలవిలలాడుతూ పెద్ద ఎత్తున శబ్దం చేసింది. గుర్తించిన గ్రామస్తులు స్థానిక అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చెరువు వద్దకు చేరుకున్న అటవీ సిబ్బంది ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించారు. కదలలేని పరిస్థితుల్లో ఏనుగు ఉండడంతో చిత్తూరు అటవీ అధికారి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి కృష్ణ అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులను వాటి మావటిలను రప్పించారు. క్రేన్లను కూడా సిద్ధం చేసిన అధికారులు తిరుపతి ఎస్వీ వైద్యులను కూడా రప్పించారు. డాక్టర్ అరుణ్, తోయిబా సింగ్ పర్యవేక్షణలో గాయపడ్డ ఏనుగును రెస్క్యూ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కుంకీ ఏనుగుల సాయంతో ఏనుగును బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఏనుగు కుడికాలు విరిగి ఉంటుందని భావించిన జూ వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెస్క్యూ చేసారు. ఏనుగు నడుముకు బెల్టు కట్టి పొక్లెయినర్‌, కుంకీ ఏనుగుల సాయంతో ఒడ్డుకు చేర్చారు. దాదాపు 15 గంటల పాటు ఆపరేషన్ గజ కొనసాగింది. అటవీ అధికారులు, పోలీసులు చివరికి ఏనుగును సేఫ్ గా బయటకు తీసారు. ఏనుగు కుడికాలు ఎముక విరిగినట్లు గుర్తించి లారీలో తిరుపతి ఎస్ వీ జూ పార్క్‌కు తరలించారు. చెరువు బురదలో కూరుకుపోయిన ఏనుగును కాపాడే ప్రయత్నంలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో తమిళనాడు అటవీ అధికారులు కూడా పర్యవేక్షించారు. వారం రోజుల క్రితం 13 ఏనుగులు ఏపీ తమిళనాడు సరిహద్దులోని పరదరామి అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించిన అధికారులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఇలా ఒంటరి ఏనుగు ప్రమాదానికి గురై ఉంటుందని భావిస్తున్నారు. ఇతర ఏనుగుల గుంపు సంచారం పై గస్తీ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. ఈడీ దర్యాప్తు

ప్రపంచంలో అతిపెద్ద శివలింగం బీహార్‌లో త్వరలో ప్రతిష్టాపన

Elon Musk: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి అసాధ్యం

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ లో కొత్త రూల్స్

ఫ్రీజర్‌లా మారిన అమెరికా.. మంచులో జారుతూ.. జూలో జంతువుల ఆటలు