స్పూన్‌ మింగేశాడు.. ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా..

Updated on: Jul 05, 2025 | 11:58 AM

చైనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి సిరామిక్‌ చెంచాను మింగాడు అయితే అది అతనికి తెలియకపోవడం విశేషం. అతనికి తెలియకుండానే ఆర్నెల్లుగా అతడి పేగుల్లోనే ఉండిపోయింది. సౌత్‌ చైనా మార్నింగ్ పోస్టు ప్రకారం.. యాన్‌ అనే వ్యక్తి జూన్‌లో షాంగైలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాక ఈ విషయం బయట పడింది. ఆహారం తీసుకున్నప్పుడు ఏదైనా ప్లాస్టిక్‌ ముక్కను మింగానేమోనని అనుకున్నాడు.

కానీ స్కానింగ్‌లో విస్తుపోయే విషయం తెలిసింది. చిన్న పేగులో ఏదో ఉందని వైద్యులు గుర్తించారు. ఆ స్పూన్‌ సున్నితమైన భాగంలో ఉండడంతో చాలా ప్రమాదకరమని వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. తను స్పూన్‌ మింగినట్టు లీలగా గుర్తుకొచ్చేది. స్పూన్‌ పొట్టలోకి జారినట్లు కల కన్నాననీ అనుకునేవాడు. ఎలాంటి ఆరోగ్య సమస్య రాక పోవడంతో సాధారణంగా ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోగా ఆ స్పూన్‌ ఉన్న విషయం అతనికి తెలిసింది. అయితే ఈ పరికరం తన కడుపులోకి ఎలా వెళ్లిందో యాన్‌ గుర్తు తెచ్చుకున్నాడు. జనవరిలో థాయ్‌లాండ్‌కి వెళ్లినప్పుడు అక్కడ విపరీతంగా తాగినట్లు, వాంతులు చేసుకోవడానికి కాఫీ స్పూన్‌తో ప్రయత్నించినట్లు గుర్తు చేసుకున్నాడు. ఆ స్పూన్‌ జారిపోయి గొంతులోకి వెళ్లింది. తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం చైనాకు వచ్చిన తర్వాత యథావిధిగా తన పనులు చేసుకున్నాడు. దీన్ని తీసేందుకు వైద్యులు ఆపరేషన్‌ లేకుండా ఫోర్సెప్స్‌ను ఉపయోగించగా, మృదువైన భాగం కావడంతో అది కూడా పొట్టలోకి జారిపోయింది. దీంత వైద్యులు రెండు పరికరాలను తీయడానికి ఎండోస్కోపీ చేయాల్సి వచ్చింది. దాదాపు 90 నిమిషాల వైద్య చికిత్స అనంతరం సిరామిక్‌ స్పూన్‌తో పాటు, ఫోర్సెప్స్‌ను బయటకు తీశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే

జాలరి పంట పండింది పో.. వలలో పడింది చూసి మైండ్ బ్లాక్

కేరళ నరమేధంపై ఒళ్లు గగుర్పొడిచే ఫిల్మ్..! డోంట్ మిస్ ఇట్ !

Samantha: ’18 ఏళ్లకే ప్రేమ.. తనే భర్తంటూ టాటూ..’ తన ఫస్ట్ లవ్‌ స్టోరీ చెప్పి షాకిచ్చిన సామ్