అంతరిక్ష యాత్రకు రెడీనా ?? టికెట్ ధర రూ. 1.77 కోట్లు మాత్రమే
అంతరిక్షయాత్ర అంటే ఎవరికైనా ఆసక్తే. అయితే ఈ యాత్రను కొందరు మాత్రమే చేయగలుగుతున్నారు. అమెరికాకు చెందిన కొన్ని స్పేస్ కంపెనీలు స్పేస్ టూరిజం పేరిట బిలియనీర్లను విజయవంతంగా అంతరిక్షయాత్రకు తీసుకెళ్లాయి. తాజాగా చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సైతం స్పేస్ టూరిజంను ప్రవేశపెట్టింది. 2027లో చేపట్టనున్న అంతరిక్ష పర్యటకానికి సంబంధించి టికెట్లను అమ్మకానికి పెట్టనుంది.
చైనాకు చెందిన స్టార్టప్ డీప్ బ్లూ ఏరోస్పేస్ 2027లో అంతరిక్ష యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్లాలని నిర్ణయించింది. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌లోని రెండు సీట్ల టికెట్లు విక్రయానికి పెట్టనున్నట్లు తెలిసిందే. అయితే ఈ టికెట్టు ధర 1.5 మిలియన్ యువాన్లుగా అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.1.77 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ టికెట్లు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. సబ్ ఆర్బిటల్ ఫ్లైట్‌లో ప్రయాణికులను తీసుకువెళతామని తెలిపింది. అంటే రాకెట్ భూ వాతావరణాన్ని దాటి, అంతరిక్షం దరిదాపుల వరకూ వెళ్లి వస్తుంది. వచ్చే నెలలో మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీప్ బ్లూ ఏరోస్పేస్ తెలిపింది. పునర్వినియోగ రాకెట్లు అధిక ప్రయోగఖర్చులతో పాటు అంతరిక్ష ప్రయాణాల ఖర్చును తగ్గిస్తుందని తెలిపింది. మరోవైపు చైనాలోని మరిన్ని కంపెనీలు స్పేస్ టూరిజం రంగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు ప్రకటించాయి. 2028 నాటికి స్పేస్ టూరిజం విమానాలను ప్రారంభించనున్నట్లు సీఏఎస్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి వెనుక కూర్చోగా స్కూటర్ నడుపుతున్న బాలిక !! మండిపడుతున్న నెటిజన్లు
అక్కోయ్.. ఫస్ట్ శాలరీనా పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావుగా
డేజంర్ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్
ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!