ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా

Updated on: Jan 05, 2026 | 7:35 PM

చైనాలోని యునాన్ గ్రామంలో సంప్రదాయ విలువలు కాపాడాలని గ్రామ పెద్దలు కఠిన నిబంధనలు విధించారు. పెళ్లికి ముందు సహజీవనం, గర్భం దాల్చినా, పది నెలల లోపు బిడ్డకు జన్మనిచ్చినా, ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకున్నా భారీ జరిమానాలు విధిస్తారు. మద్యం తాగి గొడవపడినా, పుకార్లు సృష్టించినా ఫైన్లు ఉంటాయి. ఈ బోర్డు వైరల్ అయ్యాక తొలగించారు.

ప్రస్తుతకాలంలో సహజీవనం పేరుతో పెళ్లికి ముందే గర్భం దాల్చడం, ఆ తర్వాత వివాహాలు చేసుకోవడం.. ఇంకా ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇవన్నీ ఎక్కడైనా చెల్లుతాయేమోకానీ.. మా గ్రామంలో మాత్రం నడవవు అంటున్నారు.. అంతేకాదు అలాంటి తమ గ్రామంలోకి ఎంట్రీనే ఉండకూడదని కఠినమైన నిబంధనలు పెట్టుకుని అమలు చేస్తున్నారు చైనాలో. మీరు విన్నది నిజమే.. చైనాలోని యునాన్ రాష్ట్రం లిన్‌‌కాంగ్ జిల్లాలో ఓ గ్రామస్థులు కఠినమైన నిబంధనలను పెట్టుకున్నారు. ఈమేరకు గ్రామ పెద్దలు ఓ తీర్మానం చేసి కొన్ని రూల్స్ నిర్ణయించారు. గ్రామంలో ఎవరైనా వివాహం కాకుండా కలిసి ఉంటే ఏటా 500 యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.6 వేలు జరిమానాగా చెల్లించాలని నిర్ణయించారు. అదేవిధంగా, పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి 3,000 యువాన్లు అంటే రూ.38,472, పెళ్లి అయిన తర్వాత 10 నెలల లోపే బిడ్డకు జన్మనిచ్చినా ఇంతే మొత్తం ఫైన్ కట్టాలని నిబంధన పెట్టారు. అంతేకాదు, ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు అంటే సుమారు రూ.19 వేలు, దంపతులు గొడవపడి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు, మద్యం సేవించి గ్రామంలో గొడవ చేస్తే 3 వేల నుంచి 5 వేల యువాన్లు , నిరాధార ఆరోపణలు, పుకార్లు సృష్టిస్తే 500 నుంచి 1,000 యువాన్లు జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓ బోర్డును తయారు చేసి గ్రామంలోని కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నియమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే ఆ బోర్డును తొలగించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్‌తో

ఈ ‘చిట్టి’ పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

జ్యోతిష్య శాస్త్రంలో శుభయోగాలు ఇవే.. ఏ యోగానికి ఏ ఫలితమో తెలుసా?

నిద్రలో గొంతును నులిమింది ఎవరు.. అది దెయ్యం పనేనా

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో