సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

Updated on: Jan 18, 2026 | 8:55 AM

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయంలో వార్షిక కిచిడీ మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంప్రదాయం ప్రకారం అక్కడి దేవుడికి కిచిడీని సమర్పించారు. అనంతరం అక్కడి ప్రజలతో ముచ్చటించిన సీఎం ఒక చిన్నారి బాలుడితో సరదాగా గడిపారు. ఈ క్రమంలో సీఎం ఆ బాలుడిని నీకేం కావాలి అని అడిగారు. అందుకు ఆ చిన్నారి సీఎం దగ్గరకి వెళ్లి ఆయన చెవిలో చిప్స్‌ కావాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే ముఖ్యమంత్రి నవ్వేశారు.

చిన్నారి మాటలకు ముగ్ధులైన సీఎం కాసేపు బాలుడితో ముచ్చటించారు. ఆ బాలుడి అమాయక మాటలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు అక్కడున్న వారందరూ నవ్వారు. వారంతా అలా నవ్వడంతో బాలుడు అమాయకంగా చూస్తుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. ఏమీ తెలియని వయసులో చిన్నారులకు ఆట వస్తువులు, ఆహారంపైనే దృష్టి ఉంటుందని.. అందుకే ఆ చిన్నారి అలా అడిగి ఉండొచ్చన్నారు. సాక్షాత్తూ సీఎమ్మే.. ఏం కావాలో కోరుకో అంటే.. చిప్స్ కావాలన్నాడు అంటే.. ఆ చిన్నారికి.. దేని మీదా ఆశ లేదని.. అలాంటి గుణం ఆ వయసులోనే ఉంటుందని మరికొందరు అన్నారు. మొత్తానికి ఈ సీఎంతో ఉన్న ఈ చిన్నారి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.