ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

Updated on: Mar 17, 2025 | 6:55 PM

ట్యాలెంట్‌ ఎవరి సొంతం కాదనే మాటలు మనం వింటూ ఉంటాం. ఈ ఘటన చూస్తే అది నిజమే అని ఎంతటివారైనా ఒప్పుకొని తీరుతారు. అవును ప్రతిభ చాటడానికి వయసుతో సంబంధం ఉండదు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకూ ఏదో ఒక ట్యాలెంట్‌ను కలిగి ఉంటారు. ఏదొక సందర్భంలో అది బటయపడుతుంది. కొందరు స్కూలు విద్యార్ధులు లంచ్‌ బ్రేక్‌ అనుకుంటా...క్లాస్‌ రూమ్‌లోనే హ్యాపీగా ఆడుకుంటున్నారు.

ఓ చిన్నారి జామెట్రీ బాక్స్‌ మీద అద్భుతమైన మ్యూజిక్‌ ప్లే చేశాడు. అతనికి తోటి విద్యార్ధులు తోడవడంతో టీచర్‌ సహా మిగతా విద్యార్ధులంతా ప్రేక్షకుల పాత్ర పోషించారు. అంతేకాదు ఆ మ్యూజిక్‌ని ఆస్వాదిస్తూ ఎంకరైజ్‌ చేశారు కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చిన్నారుల ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు. వాళ్లేం మ్యూజిక్ మాస్టర్స్ కాదు. సంగీతంపై అవగాహన అసలే లేదు. కానీ అద్భుతమైన ప్రాజెక్టు క్రియేట్ చేసి వండర్‌ఫుల్ స్టూడెంట్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. పుణే నగరానికి చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఆడుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థి జామెట్రీ బాక్స్‌ తీసి బెంచ్‌మీద పెట్టాడు. దానిని మరో విద్యార్థి కదలకుండా గట్టిగా నొక్కిపెట్టి పట్టుకున్నాడు. మొదటి విద్యార్థి దీనిపైన చేత్తో కొడుతూ అద్భుతంగా మ్యూజిక్‌ ప్లే చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్‌.. ఖర్చు రూ. 19 లక్షలా

అలర్ట్‌.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..

ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..

బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్

దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?