మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
చెన్నై మెట్రో బ్లూ లైన్‌లో విద్యుత్ అంతరాయం కారణంగా 25 మంది ప్రయాణికులు టన్నెల్‌లో అరగంట సేపు చిక్కుకుపోయారు. బ్యాటరీ లోపం వల్ల రైలు చెన్నై సెంట్రల్-హైకోర్టు స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. ప్రయాణికులు చీకటిలో నడుచుకుంటూ హైకోర్టు స్టేషన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన మెట్రో సేవలకు అంతరాయం కలిగించినా, అధికారులు సమస్యను సరిచేసి సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
చెన్నైలో మెట్రో ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. బ్లూ లైన్ మెట్రో రైలు చెన్నై సెంట్రల్, హైకోర్టు స్టేషన్ల మధ్య .. విద్యుత్ అంతరాయం కారణంగా మెట్రో రైలు టన్నెల్‌లో అకాలంగా నిలిచిపోయింది. దీనితో 25 మంది ప్రయాణికులు అరగంట సేపు రైలులో చిక్కుకుపోయారు. ఉదయం 5.15 నిమిషాలకు రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ హైకోర్టు స్టేషన్ మీదుగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం ప్రారంభ సమయంలో అండర్‌గ్రౌండ్ మెట్రోలో బ్లూ లైన్‌లో రెండు బ్యాటరీలు పని చేయలేదు. సాధారణంగా ఒక బ్యాటరీ పని చేయకపోయినా బాకప్ బ్యాటరీ సాయంతో రైలు ప్రయాణిస్తుంది. అయితే రెండింటిలోనూ సాంకేతిక లోపం ఏర్పడింది. రైలులో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు వెలుగు లేక చీకటిలోనే ఇరుక్కుపోయారు. అక్కడివారు రికార్డ్ చేసిన వీడియోల్లో ప్రయాణికులు హ్యాండ్రెయిల్ పట్టుకుని బయట పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. అయితే పది నిమిషాల తర్వాత హైకోర్టు స్టేషన్ వరకు అంటే దాదాపు 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం ప్రయాణికులు వరుసగా క్యూలో నిలబడి టన్నెల్ ద్వారా జర్నీ కొనసాగించిన దృశ్యాలు కూడా సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అంతరాయం బ్యాటరీలు ఫెయిల్ కావడం వల్ల జరిగినట్లు గుర్తించి పరిస్థితిని సరిచేసిన అధికారులు మెట్రో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేలా చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
